బాబోయ్ జగన్ మాస్టర్ మైండ్..ఆ స్కెచ్ అదుర్స్.!

-

రాజకీయాల్లో అదిరిపోయే వ్యూహాలు వేస్తూ ప్రత్యర్ధులకు చెక్ పెట్టడంలో జగన్ దూసుకెళుతున్నారు. 2019 ఎన్నికల నుంచి జగన్ వేసే వ్యూహాలకు తిరుగుండటం లేదు..ప్రత్యర్ధి చంద్రబాబుకు ఎక్కడకక్కడ చెక్ పెడుతూ వస్తున్నారు. ఇలా తన వ్యూహాలతో దూసుకెళుతున్న జగన్..వచ్చే ఎన్నికల్లో గెలవడానికి తనదైన శైలిలో అదిరిపోయే వ్యూహాలు సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో ప్రతి నియోజకవర్గంలో ఊహించని విధంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.

అలాగే కాస్త వైసీపీకి వ్యతిరేకత వచ్చిన స్థానాలని మళ్ళీ తమ వైపుకు తిప్పుకోవడానికి సరికొత్త స్కెచ్ లు వేస్తున్నారు. తాజాగా కొన్ని చోట్ల అదిరే వ్యూహాలని సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే రాజధాని అమరావతి ప్రాంత పరిధిలో ఉన్న తాడికొండ, మంగళగిరి స్థానాల్లో వైసీపీకి కాస్త వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు ఆ వ్యతిరేకతని తొలగించడానికి జగన్ అదిరే వ్యూహంతో వచ్చారు. రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. మొదట దీన్ని అమరావతి రైతులు అడ్డుకోవాలని చూశాయి. కోర్టుకు వెళ్ళాయి.

తాము రాజధాని కోసం ఇచ్చిన భూములని ఇళ్ల స్థలాలకు ఇవ్వడం ఏంటి..అది కూడా అమరావతి ప్రాంతం వాళ్ళకు కాకుండా వేరే ప్రాంతం వాళ్ళకు ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఏంటి అని అడ్డు చెప్పారు. కానీ కోర్టు మాత్రం ప్రభుత్వానికి ఇళ్ల పట్టాలు ఇచ్చుకోవచ్చని తీర్పు ఇచ్చింది. దీంతో అమరావతి పరిధిలో దాదాపు 50 వేల పైనే ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కొత్త ఓటర్లు వస్తారు..దీంతో తాడికొండ, మంగళగిరిలో వైసీపీకి ప్లస్ అవుతుంది.

అదే సమయంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం లేకుండా పడి ఉన్న చుక్కల భూములకు జగన్ విముక్తి కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ భూములని ప్రజలకు పంచే పనిలో ఉన్నారు. ఇలా జగన్ పేదలకు స్థలాలు ఇస్తూ..తన బలాన్ని మరింత పెంచుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news