నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ సొంత పార్టీ నేతలకు సైతం చెక్ పెట్టడానికి వెనుకాడటం లేదు. పార్టీ కోసం పెద్దగా పనిచేయకుండా.పదవులు ఉన్నాయా కదా అని పెత్తనం మాత్రం చేస్తున్న వారికి చెక్ పెట్టడానికి జగన్ రెడీ అవుతున్నారు. ముఖ్యంగా కొందరు మంత్రులపై జగన్ సీరియస్ గా ఉన్నారు. మంత్రి పదవులు దక్కాక కొందరు సరిగ్గా పనిచేయడం లేదని, అలాంటి వారిని తప్పించడానికి వెనుకాడనని జగన్ చెప్పేస్తున్నారు.
తాజాగా బడ్జెట్ సమావేశాలు మొదలైన విషయం తెలిసిందే. గవర్నర్ స్పీచ్ తర్వాత బిఏసి సమావేశం జరిగింది..అసెంబ్లీని 24వ తేదీ వరకు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత జగన్..అనూహ్యంగా కేబినెట్ సమావేశం పెట్టారు. అదే సమయంలో కొందరు మంత్రులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చేశారు. మంత్రుల పనితీరుని ఎప్పటికప్పుడు గమనిస్తున్నానని, కొందరు సరిగ్గా పనిచేయడం లేదని, ప్రతిపక్షాల విమర్శలని తిప్పికొట్టడంలో విఫలమవుతున్నారని, ఇకపై దూకుడుగా ఉండాలని, అసెంబ్లీ చర్చల్లో ఎఫెక్టివ్ గా ఉండాలని, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 7 స్థానాల్లో వైసీపీని గెలిపించాలని టార్గెట్ ఇచ్చారు.
టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఇద్దరు, ముగ్గురు మంత్రులపై వేటు వేయడానికి కూడా జగన్ వెనుకాడనని చెప్పేశారు. అలాగే జూలై నుంచి విశాఖలో పాలన మొదలవుతుందని, అందరూ విశాఖకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. అయితే ఏ మంత్రులకు వార్నింగ్ ఇచ్చారనేది క్లారిటీ లేదు..కానీ కొందరు మంత్రుల పనితీరు బాగోలేదనే చెప్పవచ్చు.
తామ శాఖలపై పట్టు సాధించింది లేదు..అలాగే తమ స్థానాల్లో సరిగ్గా పనిచేయడం లేదు. అలాంటి వారిని మంత్రి పదవుల్లో నుంచి తొలగించడమే కాదు..వచ్చే ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనని జగన్ చెప్పేశారు. మరి ఏ మంత్రికి జగన్ చెక్ పెడతారో చూడాలి.