ఏపీలో జగన్ పాలన ఓ రేంజ్‌లోనే సాగుతున్నా కూడా ఎక్కడో ఆయన పాలనలో పూర్తి స్థాయిలో ఆనందం లేదని తెలుసుకున్న జగన్ కాస్త ఇప్పుడు తన పాలనతో ఎన్టీఆర్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే సర్టెన్ కండిషన్స్ ను మంత్రులకు ఇచ్చిన జగన్ ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఫాలో కావాలని లేకపోతే పదవులు ఉండవని ఇప్పటికే హెచ్చరించారు. ఇక మంత్రి వర్గం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తవుతుండగా తాను మొదట చెప్పినట్టుగానే మళ్లీ తన కేబినెట్‌ను మార్చే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు.
ఇక ఇందుకోసం ఇప్పటికే కసరత్తులు కూడా జగన్ మొదలు పెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ వేటు కాస్తా మంత్రులు తాము పని తీరుతో నిరూపించుకున్న వారిపై ఎలాంటి చర్యలు ఉండబోవని ఇప్పటికే సంకేతాలు కూడా వెళ్లాయి. అయితే ఇప్పుడు కేబినెట్ 25 మంది మంత్రులున్నారు. అయితే మరి ఈ 25మందిని మార్చుతారా లేక కొందరినే మార్చుతారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే గతంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా తన హయాంలో ఉన్న మంత్రివర్గంపై అసహనంతో ఎలాగైనా వారిపై వేటు వేసేయాలని ఒక్క కలం పోటుతో వారందరినీ మార్చేసి మరీ కొత్త మంత్రివర్గాన్ని సెటిల్ చేశాడు. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి దారిలోనే జగన్ కూడా వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడున్న వారిపై నివేదికలు సైతం తెప్పించుకున్న జగన్ దాదాపు 18 మందిని మార్చే చాన్సెస్ ఉందని తెలుస్తోంది. కాగా వీరందరికీ కూడా ఇతర పదవులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే తన సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం.