శెభాష్ జగన్ అదరగొట్టావు..! జగన్ పై పవన్ ప్రశంస…!

-

pawan kalyan in praise of cm jagan
pawan kalyan in praise of cm jagan

ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈనాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..! ఆనాడు డాక్టర్స్ డే సందర్భంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి రాష్ట్రం లో 108 అంబులెన్స్ సర్వీసెస్ ను ప్రారంభించాడు. ఈనాడు డాక్టర్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నూతన అత్యాధునిక వసతులు కలిగిన 1088 కొత్త అంబులెన్స్ లను రాష్ట్రంలో ప్రారంభించాడు. జగన్ తలపెట్టిన ఈ కార్యానికి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తుంది. తన ప్రత్యర్థుల నోటి నుండి కూడా జగన్ పై ప్రశంసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రారంభం అయిన 1088 కొత్త అంబులెన్స్ ల విషయం పై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఎం జగన్ పై ఆయన ప్రశంసలు కురిపించాడు.

సీఎం జగన్ అంటే పవన్ కళ్యాణ్ కు పడదు, జగన్ కు కూడా అంతే..! ఇద్దరు నిత్యం ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు కానీ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ నోటి నుండే జగన్ పై ప్రశంసలు వినిపించాయి. రాష్ట్రంలో నిన్న డాక్టర్స్ డే సందర్భంగా సీఎం జగన్ ఓ అద్భుతమైన పని చేశారని కొత్తగా ప్రారంభం అయ్యిన అంబులెన్స్ లు రాష్ట్రానికి చాలా అవసరం అని ఆయన అన్నారు. రాష్ట్రం లో కరోనా కేసులు పెరుగుతున్నాయి ఇలాంటి వాతావరణం లో రాష్ట్రానికి ఆ కొత్త అంబులెన్స్ లు ఎంతగానో ఉపయోగపడతాయని అంబులెన్స్ లు ప్రారంభించినందుకు సీఎం జగన్ కు నా అభినందనలు అని ఆయన అన్నారు. అంతేకాకుండా, గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. అటు ప్రజలకు కూడా పవన్ పిలుపునిచ్చారు. ఇది ప్రపంచానికే గడ్డుకాలమని, అందుకే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సహకరిద్దాం అని ఆయన తన ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news