అయితే.. ఒకానొక సందర్భంలో మేం అన్నయ్య వెంటే ఉంటాం.. అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలను తీసుకుంటే.. అవి పవన్ అభిమానులను తీవ్రంగా హర్ట్ చేశాయి.
ముసుగు తొలగిపోయింది. ఇన్నిరోజులు పవన్ కల్యాణ్ జనసేన అంటూ.. కొత్త కొత్త అడుగులు అంటూ.. సరికొత్త రాజకీయాలు అంటూ.. ఇంకా ఏపీ రాజకీయాలనే మార్చేస్తానంటూ ఏదేదో చెప్పారు. కానీ.. తీరా చూస్తే ముసుగు తొలగిపోయినట్టుగా అనిపిస్తోంది. జనసేన కూడా ప్రజారాజ్యం బాటలోనే నడుస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులను ఇది ఆవేదనకు గురిచేస్తోందా? అంటే అవుననే చెబుతున్నాయి విశ్వసనీయవర్గాలు.
అసలు ప్రజారాజ్యం పార్టీ పెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించిందే పవన్ కల్యాణ్. ఆయనే కీలక వ్యక్తి. కానీ.. ఆకస్మికంగా ప్రజారాజ్యంలోకి వచ్చిన కొన్ని శక్తుల మధ్య ఆయన ఇమడలేక.. ఉండలేక.. వాళ్లను తట్టుకోలేక ప్రజారాజ్యం నుంచి బయటికి వచ్చేశారు పవన్. ఆయన అనుకున్నవి జరగలేదు ఆ పార్టీలో. దీంతో ఎన్నికల తర్వాత ప్రజారాజ్యం పార్టీ నుంచి వైదొలిగారు.ప్రజారాజ్యం పార్టీ నుంచి అప్పట్లో అల్లు అరవింద్ పోటీ చేశారు. తాజాగా జనసేన నుంచి నాగబాబు నర్సాపురం ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. అయితే.. రాజకీయాలు అంటే బంధుత్వాలు ఉండాల్సిందేనా? బంధువులకు, ఫ్రెండ్స్‌కు, తెలిసిన వాళ్లకు టికెట్ ఇవ్వాల్సిందేనా? లేకపోతే అది రాజకీయ పార్టీ అనిపించుకోదా? ఇక్కడే ఏ రాజకీయ పార్టీకైనా విమర్శలు వచ్చేది. బంధుత్వాన్ని పక్కన పెట్టకుండా నీతులు, నిజాయితీలు చెబితే జనాలు సహిస్తారా? జనాలకు ఆ రాజకీయాలు నచ్చుతాయా? అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో జరిగింది అదే.. ఇప్పుడు జనసేనలో జరుగుతున్నది కూడా అదే. అంటే ప్రజారాజ్యం బాటలోనే జనసేన కూడా నడుస్తున్నదా? అంటే దానికి రాజకీయ విశ్లేషకులు అవుననే చెబుతున్నారు.
అయితే.. ఒకానొక సందర్భంలో మేం అన్నయ్య వెంటే ఉంటాం.. అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలను తీసుకుంటే.. అవి పవన్ అభిమానులను తీవ్రంగా హర్ట్ చేశాయి. అప్పట్లో అవి పెద్ద దుమారమే లేపాయి. మరి.. ఇప్పుడేమైంది. అన్నయ్య వెంటే ఉంటాం అన్న నాగబాబు.. వచ్చి తమ్ముడి చెంత చేరారెందుకో? దేనికోసమే. ఏం ఆశించో? నేను రాజకీయాల్లోకి రావట్లేదు.. జనసేనలో చేరట్లేదు.. అంటూ నిన్న మొన్నటి వరకు గ్లాస్ పట్టుకొని యూట్యూబ్ వీడియోల్లో చెప్పిన నాగబాబు ఎన్నికలకు ఇంకా 20 రోజులు ఉందనగా జనసేనలో చేరి నర్సాపురం ఎంపీగా పోటీ చేయడం దేనికి నిదర్శనం. ఏమో.. రేపో మాపో.. ఆ అన్నయ్య కూడా వచ్చి చిన్నతమ్ముడి చెంత చేరతారేమో? ఏమో బాబు. ఏం రాజకీయాలో ఏమో.
అప్పటికప్పుడు పార్టీలో చేరడం… ఎంపీ సీటు సంపాదించడం.. పోటీ చేయడం. ఒకవేళ గెలిస్తే పదవులను అనుభవించడం.. వీటి కోసమేనా రాజకీయాలు చేసేది. ఎవరైనా ఇంతేనా? ఎవరూ దీనికి అతీతులు కాదా? ప్రతి ఒక్కరు బంధుత్వాలకు, ఇతర ఆశలకు, ప్రలోభాలకు లొంగాల్సిందేనా? నిఖార్సయిన రాజకీయ నాయకుడు ఒక్కడూ లేడా? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఏమో.. ఆ దేవుడికే ఎరక.