నాగబాబు వల్ల వాళ్ళంతా అసంతృప్తి గా ఉన్నారా ?

-

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఆయన చేస్తున్న పోస్టులు పట్ల జనసేన పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అర్థం పర్థం లేని పొంతన లేని పోస్టులు ట్విట్టర్ లో చేయటంతో తల బాదుకుంటున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు. 2019 ఎన్నికల టైంలో జనసేన పార్టీలో చేరిన నాగబాబు నరసాపురం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయడం జరిగింది. ఆ టైంలో దారుణంగా ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా ఎప్పటినుండో చేస్తున్న జబర్దస్త్ కామెడీ షో నుండి సడన్ గా బయటకు వచ్చేయడం జరిగింది. షో యాజమాన్యం మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ తో విభేదాలే దానికి కారణమని నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ లో చెప్పటం మనకందరికీ తెలిసినదే. Image result for nagababu janasenaఇటువంటి తరుణంలో అసూయ తో లేకపోతే సీరియస్ గానేమో తెలియదు గానీ రాజకీయ నాయకుల పై మరియు జబర్దస్త్ షో పై ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో వ్యవహరిస్తున్నారు నాగబాబు. తాజాగా ఇటీవల వైసీపీ పార్టీ తరఫున మెగాస్టార్ చిరంజీవి కి రాజ్యసభ పదవి వస్తుందని ప్రచారం జరిగిన సందర్భంలో నాగబాబు చేసిన ట్వీట్ పెను దుమారం రేపింది. దీంతో ఆ ట్వీట్ మెగా ఫ్యామిలీకి డ్యామేజీ క‌లిగించింద‌నే చ‌ర్చ న‌డిచింది. ఇంతకీ నాగబాబు చేసిన ట్వీట్ ఏమిటంటే…”లైఫ్ ఇస్తాన‌న్న వాడిని ఓడిస్తారు, లైఫ్ తీసుకునే వాళ్ల‌ని అధికార‌, ప్ర‌తిప‌క్షాలుగా ఎన్నుకుంటారు. ఏమిటో ఈ జ‌నం. దేవుడా ఈ జ‌నాల మ‌న‌సు మార్చు (భ‌విష్య త‌రాల కోసం)” అంటూ నాగ‌బాబు ట్వీట్ చేశాడు.

 

అయితే ఈ ట్వీట్ లో అంతరంగిక అర్ధం ఏమిటంటే…లైఫ్ ఇస్తాన‌న్న వాడు పవన్ కళ్యాణ్, లైఫ్ తీసుకునే  వాళ్లు టిడిపి, వైసిపి. అంతా బాగానే ఉన్నా మధ్యలో ప్రజలను ఎర్రి పప్ప చేయడంతో నాగబాబు పై సెటైర్లు పడుతున్నాయి. రాజకీయాలు చేతగాని వాళ్లనే మేము పక్కన కూర్చో పెడతాం ఓటు హక్కుతో, పార్టీలను అమ్ముకునే వాళ్లను కూడా ఓడిస్తాం అంటూ పబ్లిక్ తీవ్రస్థాయిలో కామెంట్ చేస్తున్నారు. నువ్వు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు…నీలాగా ఓడిపోతే టీవీ షోలు చేసుకునే వాళ్లను కూడా ఓడిస్తాం అంటూ నాగబాబు ని ఉద్దేశించి జనాలు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నాగబాబు ఇటువంటి ట్వీట్ చేయడంతో జనసేన పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news