జనవరి 18″ చంద్రబాబుకి జగన్ పెట్టిన టార్గెట్…?

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. రాజకీయంగా విమర్శలు వచ్చినా, సొంత పార్టీలో వ్యతిరేకత వచ్చినా సరే జగన్ మాత్రం మూడు రాజధానుల ప్రకటన విషయంలో మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. తాజాగా కేబినేట్ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని జగన్ కూడా మంత్రులకు స్పష్టంగా చెప్పినట్టు సమాచార౦. ఇక కీలక అధికారులను ఇప్పటికే అమరావతి నుంచి విశాఖ వెళ్ళమని చెప్పినట్టు సమాచారం.

కీలక అధికారులు అందరూ రెండు నెలల్లో విశాఖలో స్థిరపడాలని వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవాలని కూడా ప్రభుత్వం నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే రాజధాని మార్పు విషయంలో అధికారిక ప్రకటన వచ్చే నెల 18 వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఆ రోజు శాసన సభను సమావేశ పరిచి జగన్ అధికారికంగా ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రముఖ పత్రికల్లో కూడా దీనిపై వార్తలు వస్తున్నాయి. అంటే ఒకరకంగా విపక్ష నేత చంద్రబాబు ముందు జగన్ పెట్టిన టార్గెట్ అది. ఆ తర్వాత రాజధాని మారినా సరే చంద్రబాబు గాని,

కేంద్రం గాని ఏమీ చేయలేదు. దీనితో పార్టీ సీనియర్లు నేతలు చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ నిర్ణయాన్ని అడ్డుకోవాలని ఢిల్లీ వెళ్లాలని కూడా కోరుతున్నట్టు సమాచారం. ఢిల్లీ వెళ్లి ప్రధాని లేదా అమిత్ షా ని కలిసి ఈ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వారు కోరుతున్నారట. లేకపోతే మాత్రం మన సామర్ధ్యంపై ప్రజల్లో కూడా నమ్మకం సన్నగిల్లుతుందని జగన్ నిర్ణయానికి అప్పుడు ఈ జిల్లాలు కూడా మద్దతు ఇస్తాయని ఉత్తరాంధ్ర జిల్లాల్లో, రాయలసీమలో జగన్ బలపడతారని కాబట్టి జనవరి 18 లో చంద్రబాబు అడ్డుకోవాలని కోరుతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news