పార్లమెంట్ ని షేక్ చేసిన జయ…!

ప్రస్తుతం సినీ పరిశ్రమ పడుతున్న కష్టాల పై సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ పార్లమెంట్లో కాస్త గట్టిగానే తన గళం వినిపించారు. బాలీవుడ్ ని కించపరిచే కుట్ర జరుగుతుంది అనే అంశంపై మాట్లాడటం నుంచి కూడా ఆమె దేశంలో ఉన్న పోషకాహార లోపం గురించి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. వినోద పరిశ్రమ లెక్కలేనన్ని మందికి ఉపాధి ఎలా కనిపిస్తుంది అనే అంశం గురించి మాట్లాడుతూ…

అవసరమైన సమయంలో సినీ పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వినోద పరిశ్రమ ప్రతిరోజు 5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అందిస్తుందని ఆమె చెప్పారు. పరోక్షంగా సుమారు ఐదు మిలియన్ల మంది ఉద్యోగులు ఉన్నారని ఆమె అన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు కూడా సినీ పరిశ్రమ ఎంతో కొంత మందికి ఉపాధి అందిస్తుందని చెప్పారు. ప్రజల దృష్టి మళ్లించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా సినీ పరిశ్రమను అడ్డంపెట్టుకుని ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.