జ‌గ‌న్‌పై జేడీ పొగ‌డ్త‌లు…. రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం

-

తిట్టిన నోట‌నే పొగ‌డడం.. అది ఓ ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌ను… ప్ర‌తిప‌క్ష పార్టీలో ఉన్న నేత‌లు అధికార పార్టీపై దుమ్మెత్తిపోయ‌డం పరిపాటి.. కానీ ఈ నేత మాత్రం ఏకంగా సీఎం జ‌గ‌న్‌ను విచార‌ణ‌ల పేరుతో జైలు పాలు చేసిన పెద్ద పోలీసాఫీస‌ర్‌… స‌మాజాన్ని మారుద్దామ‌ని రాజ‌కీయాల బాట ప‌ట్టాడు.. కానీ కాలం క‌లిసిరాక ఎవ‌రినైతే జైలు పాలు చేశాడో.. ఆయ‌న పార్టీ నేత చేతిలోనే ఘోరంగా ఓడిపోయాడు.. ఓడిపోవ‌డ‌మే కాదు… ఇప్పుడు అదే పార్టీ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను, సీఎం జ‌గ‌న్ చేస్తున్న ప‌నుల‌ను త‌న నోటితోనే పొగుడుతూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నాడు… అంతేనా.. త‌న సొంత పార్టీ అధినేత కు వ్య‌తిరేకంగా అధికార‌పార్టీ సీఎంను పొగ‌డ‌టం ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతుంది.

JD lakshmi narayana interesting comments On Ys Jagan
JD lakshmi narayana interesting comments On Ys Jagan

ఇంత‌కు సీఎం జ‌గ‌న్‌ను జైల్లో పెట్టి, విచార‌ణ పేరుతో నానాయ‌త‌న‌కు గురి చేసి, ఇప్పుడు అదే నోటితో పొడుగుతున్న నేత ఎవ‌రో కాదు సీబీఐ రిటైర్డ్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌. సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అయితే ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంగా ఉన్న‌ప్పుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగా అప్ప‌టి సీఎం కిర‌ణ్‌కుమార్‌రెడ్డితో లాలూచీ రాజ‌కీయాలు నెరిసిన అప్ప‌టి, ఇప్ప‌టి ప్ర‌తిప‌క్ష నేత టీడీపీ ఆధినేత చంద్ర‌బాబు నాయుడు అక్ర‌మ కేసులు బనాయించారు.

ఈ కేసుల‌ను సీబీఐకి అప్ప‌గిస్తే జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ విచార‌ణాధికారిగా సీఎం, ప్రతిప‌క్ష నేత‌ల ఒత్తిళ్ళ‌కు త‌లొగ్గి చెప్ప‌మ‌న్న‌ట్లు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు గుప్పించారు అప్ప‌టి, ఇప్ప‌టి వైసీపీ నేత‌లు. కాలం మారింది.. కాలంతో పాటు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ మారాడు. సీబీఐకి స్వ‌చ్ఛంద ప‌ద‌వి విర‌మ‌ణ చేసి రాజ‌కీయ నాయ‌కుడిగా అవ‌తార‌మెత్తాడు. జేడీగా ప్ర‌జ‌ల్లో ఓ డైన‌మిక్ అధికారిగా ముద్ర‌ప‌డిన ల‌క్ష్మీనారాయ‌ణ సినిన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీలో చేరి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయాడు. పాపం కాలం క‌లిసి రాలేదు. జ‌గ‌న్‌ను జైల్లో పెట్టిన ల‌క్ష్మీనారాయ‌ణ జ‌గ‌న్ పెట్టిన అభ్య‌ర్థి చేతిలోనే ఓడిపోయాడు.

ఇక అప్ప‌టి నుంచి కొంత సైలెన్స్‌గా ఉంటున్న ల‌క్ష్మీనారాయ‌ణ ఇప్పుడు స‌డ‌న్‌గా జ‌గ‌న్‌ను పొగుడుతూ, ఆయ‌న చేప‌డుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌శంసిస్తుండ‌టం ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శ్రీకాకుళం జిల్లాలో లక్ష్మీ నారాయణ ఈ కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయని మాజీ జేడీ లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. మద్య పాన నిషేధం దిశగా ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలను అభినందించారు. మద్యపాన నిషేధం జరిగితే సమాజానికి మేలు జరుగుతుందని వివరిస్తూనే.. ముఖ్యమంత్రి మద్య పాన నిషేధం విషయంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన ప్రశంసించారు.

అంతేకాదు మ‌ద్య‌పాన నిషేదం అమ‌లు చేయ‌డం స‌ర్కారు వ‌ల్ల కాద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటుంటే జేడీ మాత్రం బిన్న స్వ‌రాలు వినిపించాడు. ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ జేడీ వ్యాఖ్యాల‌తో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడోన‌ని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుండ‌గా, ఇటు ప్ర‌తిప‌క్ష పార్టీ నేత చంద్ర‌బాబు నాయుడు జేడీ వ్యాఖ్యాల‌తో ఎలా స్పందిస్తాడో మ‌రి. ఏదైమైనా తాను జైల్లో పెట్టిన వ్య‌క్తిని తానే పొగ‌డ‌టం ఎవరికైనా కొంత ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఆ వ్య‌క్తి తీసుకున్న నిర్ణ‌యం మంచిదైన‌ప్పుడు ప్ర‌శంసించ‌డం త‌ప్పేమి కాద‌నేది స‌త్యం. ఈ విష‌యంలో త‌న‌కు ఇబ్బంది క‌లిగించిన వారిచేతే శ‌భాష్ అనిపించుకున్న జ‌గ‌న్ గొప్పొడే మ‌రి…!

Read more RELATED
Recommended to you

Latest news