జీవిత రాజశేఖర్ ఇంతకు ఏ పార్టీలో ఉన్నారు ?

-

పాలిటిక్స్ లో కండువాలు మార్చటం సహజమే. సినిమా నటులైతే పార్టీలో చేరినా, మారినా అదో పెద్ద వార్తవుతుంది.కాని వీరు ఎప్పుడే పార్టీలో ఉన్నారో ఎవరికీ తెలియటం లేదు. సడన్ గా పార్టీ ఆఫీసులో కండువా కప్పుకుని కనిపించటం ఇప్పుడు చర్చగా మారింది. జీవిత, రాజశేఖర్ ఇద్దరు కలిసి రాజకీయాల్లోకి వచ్చారు.వరుసగా పలు రాజకీయ పార్టీల మెట్లు ఎక్కారు. ఉన్నట్టుండి ఆమె బీజేపీ కార్యాలయంలో దర్శనమివ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వైఎస్సార్‌ కి సన్నిహితంగా వ్యవహరించారు..టీడీపీ లో పని చేశారు.. తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెను సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మెంబర్ ను చేసింది బీజేపీ. కొంత కాలం బీజేపీలో ఉన్న ఈ జంట వైసీపీలోకి జంప్ చేసింది. జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కూడా కప్పుకున్నారు.కానీ ఉన్నట్టుండి మూడు రోజుల క్రితం బీజేపీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఫోన్ చేసి తనకే సమాచారం ఇవ్వటం లేదని, బాధ్యతలు కూడా అప్పగించడం లేదని అడిగారట. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆఫీసుకి వచ్చారు జీవిత..పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అంతేకాదు.. ఆమెను బీజేపీ నేతగానే ఆ సమావేశంలో పరిచయం చేశారు. ఆమె కూడా బీజేపీ లో ఉన్నట్టే వ్యవహరించారు. ఇప్పుడు అసలు చర్చ మొదలయింది.

అసలు జీవిత రాజశేఖర్ బీజేపీలోనే ఉన్నారా? ఉంటే ఇన్ని రోజులు ఏమయ్యారు? వైసీపీలో చేరిన తర్వాత బిజెపిలోకి తిరిగి ఎప్పుడొచ్చారు? ఇదే డిస్కషన్ కమలం పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. దీనిపై పార్టీ కార్యకర్తలతో పాటు, ఇతర నేతల్లో కూడా కన్ఫ్యూజన్ ఏర్పడిందట. ప్రస్తుతం జీవిత ఒక్కరే బీజేపీ కండువాతో కనిపిస్తున్నారు. ఇప్పటి వరకూ వైసీపీలో ఉన్న జీవిత బీజేపీలో చేరాలంటే.. సోము వీర్రాజు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోవాల్సింది. కానీ ఆమె తెలంగాణ రాజకీయాల పట్ల ఆసక్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో జీవిత రాజశేఖర్ దంపతులు ఓ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారని.. అందుకే బీజేపీలో చేరారనే ప్రచారం కూడా జరుగుతోందట. అసలు ఇంతకు రెండేళ్లయినా గడవక ముందే వైసీపీ నుంచి జీవిత ఎందుకు బయటకొచ్చారో మరి..

Read more RELATED
Recommended to you

Latest news