ముషీరాబాద్‌లో లక్ష్మణ్‌కు ఈ సారి లక్ ఉందా?

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బి‌జే‌పికి కాస్త పట్టున్న స్థానాల్లో ముషీరాబాద్ కూడా ఒకటి. ఇక్కడ బి‌జే‌పి తరుపున కే. లక్ష్మణ్ పనిచేస్తున్నారు. ఎప్పుడో 1999 ఎన్నికల్లో టి‌డి‌పితో పొత్తులో భాగంగా లక్ష్మణ్ ముషీరాబాద్ లో గెలిచారు. ఆ తర్వాత వరుసగా ఓడిపోతూ వచ్చారు. 2009 ఎన్నికల్లో కాస్త పొరాడి సెకండ్ ప్లేస్ లో నిలబడ్డారు. ఇక 2014 ఎన్నికల్లో టి‌డి‌పి తో పొత్తులో భాగంగా మరోసారి ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలా సత్తా చాటిన లక్ష్మణ్..2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ సారి బి‌జే‌పి సింగిల్ గా ముందుకెళ్లడంతో..2018 ఎన్నికల్లో మూడో స్థానంలోకి వచ్చారు.

అయితే ఈ సారి రాష్ట్రంలో బి‌జే‌పి బలం పెరుగుతుంది..దీంతో ముషీరాబాద్ లో ఈ సారి గెలిచి తీరాలనే పట్టుదలతో లక్ష్మణ్ పనిచేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా సరే బి‌జే‌పి అధిష్టానం లక్ష్మణ్‌కు రాజ్యసభ ఇచ్చింది. ఇక తెలంగాణలో బి‌జే‌పి బలోపేతం చేసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ముషీరాబాద్ బరిలో మరోసారి నిలబడి సత్తా చాటాలని చూస్తున్నారు.

కాకపోతే ప్రస్తుతం అక్కడ బి‌ఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఉన్నారు. ఆయనకు ప్రస్తుతం అంత పాజిటివ్ కనిపించడం లేదు. ఇక్కడ బి‌జే‌పి పికప్ అవుతుంది. అదే సమయంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కాస్త బలం ఉంది. దీంతో ఇక్కడ ఏ పార్టీ ఆధిక్యంలో ఉందనే అంచనాకు రావడం లేదు. మూడు పార్టీల మధ్య గట్టి ఫైట్ నడిచే ఛాన్స్ ఉంది. అయితే గ్రేటర్ పరిధిలో బి‌జే‌పి బలపడుతుంది..గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి లక్ష్మణ్ పై ఉంది. ఒకవేళ కాస్త బి‌జే‌పికి అనుకూల పవనాలు వీచిన చాలు ముషీరాబాద్ లో లక్ష్మణ్ కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం.

Read more RELATED
Recommended to you

Latest news