రఘురామ కృష్ణం రాజు నన్ను చంపాలని చూస్తే ఆయనే పోతారు: కేఏ పాల్

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు… ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ పేరు ఒక సంచలనం. ఆయన ఏది మాట్లాడినా సరే సంచలనం అవుతుంది. ఈ తరుణంలో ఆయన టార్గెట్ గా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేయే పాల్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రఘురామ కృష్ణంరాజు హిందూ, క్రైస్తవుల మధ్య గొడవపెట్టాలని చూస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఏపీలో మత మార్పిడి చట్టాన్ని తీసుకురావాలని గతంలో డిమాండ్ చేశారని, దీన్ని తాను ఖండించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ నేపధ్యంలోనే తన అసిస్టెంట్‌కు ఫోన్ చేసి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారని ఆయన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతుంది. ఇలాంటి వారికి ప్రపంచలో చాలా మందిని చూశానన్న ఆయన… నన్ను చంపడానికి ప్రయత్నిస్తే మీరే పోతారని ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్య చేసారు. గత ఎన్నికల్లో ఆయన గురించి తాను ప్రార్థన చేస్తే ఇప్పుడు ఇష్టమొచ్చినట్లు వాగుతారా అంటూ విమర్శలు చేసారు. తనను బెదిరించిన మెసేజ్ కూడా తన వద్ద ఉందని అన్నారు.