మోడీతో టచ్ లో ప్రభుత్వంలో కీలక నేత…!

-

మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలయింది. ఏకంగా కాంగ్రెస్ సీనియర్ నేతకు గాలం వేసారు బిజెపి పెద్దలు. కాంగ్రెస్ లో కీలక నేతగా ఉంటున్న యువ సీనియర్ నేతను లక్ష్యంగా చేసుకుని బిజెపి పావులు కదపడం మొదలుపెట్టింది. ఆ యువనేత ఎవరో కాదు జ్యోతిరాదిత్య సింధియా. మధ్యప్రదేస్ మాజీ ముఖ్యమంత్రి మాధవరావు సింధియా కుమారుడే అతను. కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్నారు.

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యే అర్హతలు కూడా సదరు యువనేతకు ఉన్నాయి. వాస్తవానికి 2018 లో అతను మధ్యప్రదేశ్ కి ముఖ్యమంత్రి అవ్వాల్సి ఉంది. అయితే అప్పుడు రాజస్థాన్ కి మధ్యప్రదేశ్ కి యువనేతలు వద్దు సీనియర్ నేతలు ముద్దు అనే సిద్దాంతంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ లో సచిన్ పైలెట్ ని కాదని,

మధ్యప్రదేశ్ లో సింధియ ను కాదని అక్కడ అశోక్ గెహ్లాట్ ని మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ని ముఖ్యమంత్రులుగా చేసింది. రాజస్థాన్ పరిస్థితి ఏమో గాని ఇప్పుడు మధ్యప్రదేశ్ లో మాత్రం సిందియా ప్రభుత్వాన్ని కూల్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సింధియా కు బలమైన వర్గం ఉంది. ఆయనకు అంటూ ఎమ్మెల్యేల్లో కొంత మంది విధేయులు కూడా ఉన్నారు. బలమైన రాజకీయ కుటుంబం కాబట్టి కాంగ్రెస్ ఆయనకు పెద్ద పీట వేసింది.

ఇక ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని కూల్చడానికి సింధియా వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఓ రిసార్ట్‌ కి వెళ్లినట్టు సమాచారం. వారిలో కీలక మంత్రులు ఉండటం ఇప్పుడు కమల్ నాథ్ ని కలవరానికి గురి చేస్తుంది. తన ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని భావించిన సిఎం కి… వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి షాక్ ఇచ్చారు. ఫోన్లు స్విచాఫ్ చేసిన వారిలో రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి తులసి సిలావత్,

కార్మికశాఖ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా, రవాణా మంత్రి గోవింద్ సింగ్ రాజ్‌పుత్, మహిళా-శిశు అభివృద్ధి మంత్రి ఇమార్తి దేవి, ఆహారం-పౌరసరఫరాల మంత్రి ప్రద్యుమ్న సింగ్ తమర్, పాఠశాల విద్యమంత్రి ప్రభుర చౌదరి తదితరులు ఉన్నారు. సింధియా కూడా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఆయన కాంగ్రెస్ అధిష్టానం తో కూడా టచ్ లో లేరని అంటున్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీ తో నేరుగా మాట్లాడారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news