తెలంగాణ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలు ఆసక్తికరంగా మారాయని చెప్పవచ్చు. అటువంటి నియోజకవర్గాలలో కామారెడ్డి ఒకటి. అధికార, ప్రతిపక్ష ముఖ్య నేతలు ఇద్దరు తలపడుతున్న నియోజకవర్గం కామారెడ్డి. సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి బరి లో దిగారు. అటు కాంగ్రెస్ తరపున టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తుంటే, బిజెపి నుండి కాటిపల్లి వెంకట రమణారెడ్డి పోటీ చేస్తున్నారు. కానీ ఇక్కడ బీసీలు అంటే ముదిరాజుల ఓట్లు అధికం. అందునా మహిళా ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. 55% ఉన్న ముదిరాజ్ ఓటర్ల తీర్పు కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఇక్కడ తలబడుతున్న ముగ్గురు అభ్యర్థులలో మహిళా ఓటర్లు ఒక పార్టీ వైపు ఉంటే, యువ ఓటర్లు మరో పార్టీ వైపు ఉన్నారు. వృద్ధులు మరో పార్టీ వైపు చూస్తున్నారు.
కామారెడ్డి పట్టణంలో పద్మశాలి, వైశ్య ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వారు ఏ పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికలలో కామారెడ్డిలో 70 శాతానికి మించి పోలింగ్ జరగలేదు. కానీ ఈసారి త్రిముఖ పోటీ ఉన్న నేపథ్యంలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పెరిగిన ఓటింగ్ శాతం కూడా అభ్యర్థి గెలుపును నిర్ణయిస్తుందని రాజకీయ విశ్లేషణ.
మరి కామారెడ్డి లో గెలిచే అభ్యర్థి ఎవరో???