‘ పొంగులేటి ‘ నిన్ను పాలేరు జ‌నాలి న‌మ్మాలి… నువ్వు మాత్రం న‌మ్మ‌వ్‌… ఇదెక్క‌డి అన్యాయం..!

-

పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పాలేరు జనాలు నమ్మాలి.. కానీ ఆయన మాత్రం పాలేరు ప్రజలను పాలేరు ఓటర్లను… చివరకు ఆయన పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తలను కూడా నమ్మను అన్నట్టుగా ఆయన బిహేవియర్ ఉంది. ఆ మాటకు వస్తే పొంగులేటిది సత్తుపల్లి నియోజకవర్గం. సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలం నారాయణపురం పొంగులేటి స్వగ్రామం. పాలేరు బార్డర్లు… రూపురేఖలు కూడా పొంగులేటికి తెలియవు.

2014లో ఆయన ఖమ్మం ఎంపీగా ఉన్న ఇప్పుడు కూడా పాలేరుకు కనీసం చుట్టపు చూపుగా కూడా ఎప్పుడు రాలేదు. ఐదేళ్లు ఎంపీగా ఉన్న పాలేరు నియోజకవర్గానికి ఈ పని చేశాను అని పొంగులేటి చెప్పుకోవటానికి కూడా ఏం లేదు. వైసీపీ నుంచి గెలిచి అధికార బీఆర్ఎస్ పార్టీలోకి మారినా కూడా అప్పుడు అధికార పార్టీ అండదండలతో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయొచ్చు… పాలేరు నియోజకవర్గ ఓటర్లు పొంగులేటి మీద నమ్మకంతో ఆయనకు భారీ మెజార్టీ కట్టబెట్టి… ఆయనను ఎంపీగా గెలిపిస్తే ( పొంగులేటి ఎంపీగా గెల‌వ‌డంలో అప్పుడు పాలేరులో ఆయ‌న‌కు వ‌చ్చిన మెజార్టీయే కీల‌కం) ఆయన మాత్రం పాలేరు నియోజకవర్గ ప్రజలకు చేసింది పూర్తిగా శూన్యం.

పొంగులేటి ఎంపీగా ఉన్న ఐదేళ్ల‌లో అది కూడా అధికార బీఆర్ఎస్‌లో ఉండి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఏం చేశారో చెప్ప‌మంటే ఏం చెప్ప‌లేని ప‌రిస్థితి. విచిత్రం ఏంటంటే వ‌చ్చే 30న జ‌రిగే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌లేనని అర్థ‌మైన పొంగులేటి ఓట‌ర్ల‌కు వారం రోజుల ముందు నుంచే భారీగా తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. ఈ తాయిలాలు పంపిణీ చేసేందుకు కూడా స్థానిక కాంగ్రెస్ నాయ‌కుల‌ను న‌మ్మ‌ని పొంగులేటి ఆంధ్రాలో క‌డ‌ప నుంచి మ‌నుష్యుల‌ను ర‌ప్పించి వారితో ఈ తాయిలాల పంపిణీ చేయిస్తున్నారు.

అస‌లు పొంగులేటి అనే వ్య‌క్తికి పాలేరుకు సంబంధం లేదు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్‌లో ఉండి స‌డెన్‌గా డ‌బ్బు సంచుల‌తో కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నాడు. ఇప్పుడు పాలేరులో ద‌శాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం క‌ష్ట‌ప‌డుతోన్న కార్య‌క‌ర్త‌ల‌ను, కేడ‌ర్‌ను న‌మ్మ‌కుండా ఆంధ్రాలో క‌డ‌ప నుంచి జ‌నాల‌ను ర‌ప్పించి వాళ్ల‌తో పాలేరులో రాజ‌కీయం చేయిస్తుండ‌డంతో స్థానిక కాంగ్రెస్ కేడ‌ర్ ర‌గిలిపోతోంది. అస్స‌లు కాంగ్రెస్ వీరాభిమానుల‌కు, పొంగులేటి టీంకు మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక … వారంతా రేపు పోలింగ్ రోజు త‌మ స‌త్తా ఏంటో చూపుతామ‌ని మండిప‌డుతున్నారు.

అస‌లు నియోజ‌క‌వ‌ర్గానికే నాన్ లోక‌ల్ అయిన పొంగులేటి ఎన్నిక‌ల్లో పోటీలో ఉన్న‌ప్పుడే ఈ త‌ర‌హా రాజకీయం చేస్తుంటే .. రేపు ఇంకెలా ఉంటుందో అన్న ఆందోళ‌న కాంగ్రెస్ వాళ్ల‌లోనే ఉంది. పొంగులేటి నాన్ లోక‌ల్‌, ఆంధ్రా జ‌నాల‌తో రాజ‌కీయం చేస్తుంటే ఇటు బీఆర్ఎస్ అభ్య‌ర్థి కందాళ పూర్తిగా లోక‌ల్ నినాదంతో… లోక‌ల్ కేడ‌ర్‌తోనే దూసుకు పోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version