” పవన్ కల్యాణ్ చేసిన ఈ పని జన్మలో మర్చిపోలేము .. ఊరికే వదలము ” కాపుల వార్నింగ్ ? 

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా బిజెపి పార్టీ తో కలసి పని చేయడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాపులు. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు కి మద్దతు తెలపడంతో కాపులు అంతా చంద్రబాబు కి ఓటు వేసి 2014 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు.

అయితే ఆ తరువాత కాపులు పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరుకు 2019 ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారు కాపులు. ఇటువంటి నేపథ్యంలో మొదటి నుండి జనసేన పార్టీకి అండగా ఉంటున్న కాపులు తాజాగా ఎవరితో చర్చించకుండా ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీ తో కలిసి దోస్తీ కట్టడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ పనికి జన్మలో మర్చిపోలేము…అలాగే ఊరికే వదలము అంటూ కాపులు వార్నింగ్ ఇస్తున్నారు.

 

గతంలో చిరంజీవి కూడా ఇదే మాదిరిగా వ్యవహరించి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు..ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బీజేపీ పార్టీలో కలిపేశారు. అన్నదమ్ములు ఇద్దరు రెండు జాతీయ పార్టీలలో స్థాపించిన పార్టీలను కలిపేసి కాపు జాతి పరువు తీశారు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మతతత్వ పార్టీ అయినా బిజెపి పార్టీ తో కలిసి పని చేయడాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు కాపులు.