విభజన సమస్యలు త్వరలో కొలిక్కి.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయం

-

గవర్నర్… రంజాన్ సందర్భంగా రాజ్ భవన్ లో ఇఫ్తారు విందు ఏర్పాటు చేయగా… ఇఫ్తారు విందుకు హాజరైన కేసీఆర్, జగన్… ముందుగా గవర్నర్ తో భేటీ అయ్యారు. వాళ్లు గవర్నర్ తో గంటకు పైగా చర్చించారు.

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్ లో ఉన్న అన్ని అంశాలు, రాష్ట్ర విభజన సమస్యలు, ఇతర సమస్యలన్నింటినీ సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ నిర్ణయం తీసుకున్నారు. విభజన వివాదాల పరిష్కారం కోసం త్వరలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు.

రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు కావస్తున్నా.. ఇంకా పూర్తి కాని వివాదాలకు వెంటనే పుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో కేసీఆర్, వైఎస్ జగన్ రాజ్ భవన్ లో భేటీ అయ్యారు. గవర్నర్… రంజాన్ సందర్భంగా రాజ్ భవన్ లో ఇఫ్తారు విందు ఏర్పాటు చేయగా… ఇఫ్తారు విందుకు హాజరైన కేసీఆర్, జగన్… ముందుగా గవర్నర్ తో భేటీ అయ్యారు. వాళ్లు గవర్నర్ తో గంటకు పైగా చర్చించారు.

రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల విభజన, విద్యుత్ ఉద్యోగుల విభజన, విద్యుత్ సంస్థల మధ్య విద్యుత్ బిల్లులు, ఆస్తులు, అప్పుల పంపకాలు, ఇతర అంశాలన్నీ ఈ భేటీ చర్చించారు. సో.. త్వరలోనే తెలంగాణ, ఏపీ మధ్య ఉన్న సమస్యలన్నింటికీ ఇరు రాష్ట్రాల సీఎంలు పుల్ స్టాప్ పెట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news