బ్రేకింగ్ : సాగర్ సీటు నోముల భగత్ కే.. బీఫాం అందించిన కేసీఆర్

Join Our Community
follow manalokam on social media

ప్రచారం జరుగుతూ వస్తున్నట్టుగానే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం నోముల నర్సింహయ్య కుమారుడికే టికెట్ లభించింది. కొద్ది సేపటి క్రితమే అందుకు సంబందించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.  నోముల నరసింహయ్య మృతితో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. తెలంగాణలో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత టీఆర్‌ఎస్‌ ఎదుర్కోబోతున్న మూడో ఉపఎన్నిక ఇది.

హుజూర్నగర్, దుబ్బాక ఉప ఎన్నికలు జరగగా మొదటి చోట టీఆర్ఎస్ బలం చాటుకుంది. కానీ దుబ్బాకలో బోల్తా పడింది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్‌ఎస్‌ ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది.  దీంతో ఉపఎన్నికల్లో లోకల్, నాన్‌లోకల్‌, సామాజికవర్గాల ఈక్వేషన్స్ తో ఆ కుటుంబానికి కాకుండా మరో టికెట్ ఇవ్వాలని ఆలోచనలు కూడా నడిచాయి. అయితే ఇప్పుడు చివరికి నోముల కుమారుడు నోముల భగత్ ఉప ఎన్నికల అభ్యర్థిగా ఎంపిక చేశారు.   టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం అయిన తెలంగాణ భవన్ లో నోముల భగత్ కి కేసీఆర్ బీఫాం అందించారు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...