తెలంగాణలో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తర్వాత ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం హీట్ హీట్‌గా ఉంది. మరోవైపు కాంగ్రెస్‌లో టీ పీసీసీ పీఠం కోసం జరుగుతోన్న కుమ్ములాటలు కూడా మామూలుగా లేవు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సీఎం కేసీఆర్ త్వరలోనే తన కేబినెట్లో పునర్ వ్యవస్థీకరణ చేస్తున్నారట. ఈ దసరాకు చేసిన మార్పుల్లో కేసీఆర్ కొత్తగా ఆరుగురు మంత్రులకు చోటు ఇచ్చారు.
ఇక తాజా మార్పుల్లో ఖచ్చితంగా ఇద్దరిపై వేటు ఉంటుందన్న చర్చలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఈ వార్తలతో కేబినెట్ నుంచి ఎవరు బయటకు వెళతారన్నది పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కేబినెట్ లో నలుగురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ జిల్లాలో సీనియర్ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌పై కేసీఆర్ గుర్రుగా ఉన్నారు.
ఈటల పార్టీకి ఇబ్బందిగా మారాడనే కేసీఆర్ ఆయనకు చెక్ పెట్టేందుకే కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్న గంగుల కమలాకర్‌ను కేబినెట్లోకి తీసుకున్నారన్న టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో
సబితా ఇంద్రారెడ్డి, మల్లా రెడ్డి ఉండగా సబితా ఇంద్రారెడ్డి కేబినెట్లోకి వచ్చినప్పుడే మల్లారెడ్డిని మంత్రి వర్గం నుంచి పంపించేస్తారని అనుకున్నారు. మల్లారెడ్డిపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిర్యాదులు ఎక్కువ అవ్వడంతో అవుట్ లిస్టులో ఆయనే ఫస్ట్ ఉంటారని అంటున్నారు.
ఇక ఈటల రాజేందర్ విషయంలో ఏం డెసిషన్ తీసుకుంటారన్నది సస్పెన్స్. ఇక ఉమ్మడి నల్లగొండలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇటీవల ప్రయార్టీ పెరిగింది… ఆయన విషయంలో ఏం జరుగుతుందో ? చూడాలి. ఇక కవిత ఓటమి తర్వాత ఓ మంత్రి టార్గెట్గా ఆరోపణలు వస్తున్నాయి. మరి ఆయన పరిస్థితి ఏంటన్నది కూడా డౌట్‌గానే ఉంది. ఏదేమైనా కేసీఆర్ ఏదైనా అనుకుంటే ఎవ్వరిని లెక్క చేయకుండా చేయాల్సింది చేస్తారు. మరి ఈ పునర్వవస్థీకరణ జరిగితే మరెన్ని సంచలనాలు చేస్తారో ? చూడాలి.