కేసీఆర్ సారు…కిరికిరి ఏంటో ఇప్పుడే తెలిసిందా?

అవసరానికి తగ్గట్టుగా మాటలు మార్చడం….రాజకీయం చేయడం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అందులో కేసీఆర్ లాంటి నాయకుల గురించి చెప్పాల్సిన పని లేదు. సందర్భాన్ని బట్టి రాజకీయం మార్చేస్తారు. ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో కూడా కేసీఆర్ అనూహ్యంగా స్ట్రాటజీలు మార్చేస్తున్నారు. అసలు దళితబంధు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిందే…ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టడానికి…అంటే హుజూరాబాద్ ఉపఎన్నికలో సత్తా చాటాడానికి…అలాంటప్పుడు ఎన్నికల కోడ్ వచ్చాక…పథకాలని ఎన్నికల సంఘం ఆపేస్తుంది. మళ్ళీ ఎన్నికలయ్యాక షరా మామూలే..ఆ విషయాలు గురించి కేసీఆర్‌కు బాగా తెలుసు.

kcr
kcr

అయినా సరే కావాలనే ఎన్నికల సంఘం ప్రతిదానికి కిరికిరి పెడుతోందని మాట్లాడుతున్నారు. పైగా టీఆర్ఎస్ నేతలు ఏమో దళితబంధుని ఆపేసింది…బీజేపీ నేతలు అని మాట్లాడుతున్నారు. అంటే టీఆర్ఎస్సే కరెక్ట్‌గా ఎన్నిక కోసం పథకాన్ని తీసుకొచ్చింది..ఎన్నికల కోడ్ వచ్చాక ఆగిపోతుందని తెలుసు. అయినా సరే ఆ నెపం బీజేపీ, ఎన్నికల సంఘంపై తోసేయాలని చూస్తున్నారు.

పైగా కరోనా సమయంలో హుజూరాబాద్‌లో బహిరంగ సభలు పెట్టడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. వెయ్యి మందికి మించి  సభల్లో ఉండకూడదని రూల్స్ కూడా పెట్టారు. దీంతో ఏ పార్టీకైనా భారీ సభలు పెట్టడానికి లేదు. అలాంటప్పుడు కేసీఆర్ మాత్రం…తన సభాని కావాలనే అడ్డుకుంటున్నారని ప్రచారం చేసుకుంటున్నారు.

కావాలని కోర్టుల్లో కేసులు వేసి సభలు పెట్టకుండా చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అంటే కేసీఆర్ సభలు పెడితే హుజూరాబాద్ ప్రజలు మూకుమ్మడిగా టీఆర్ఎస్‌కే ఓటు వేయాలని అనుకోవు కదా..అయినా ఇతర పార్టీల్లో కూడా ప్రజలని ఆకర్షించే నాయకులు చాలామంది ఉన్నారు. వారు సభలు పెట్టినా సరే జనం భారీగా వస్తారు. ఇక వారు కూడా ఎన్నికల సంఘానికి లోబడే పనిచేస్తున్నారు…కానీ కేసీఆర్ మాత్రం ఎన్నికల సంఘంపై విమర్శలు చేస్తున్నారు. అంటే ఎన్నికల సంఘం రూల్స్ కేసీఆర్‌కు నచ్చినట్లు లేవు..అందుకే కిరికిరి పెడుతుందని మాట్లాడుతున్నారు. అనుకూలంగా ఉన్నప్పుడు ఈ కిరికిరిలు తెలియలేదు అనుకుంటా అని ఇతర పార్టీలు కౌంటర్లు వేసే పరిస్తితి.