మహిళల కోసం కేసీఆర్ ప్రత్యేక ప్లాన్..

-

తెలంగాణాలో కరోనా వైరస్ లాక్ డౌన్ తర్వాత ఆర్ధిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది…? ఇప్పుడు దీనిపై అనేక చర్చలు జరుగుతున్నాయి. లాక్ డౌన్ ని అవసరం అనుకుంటే వచ్చే నెల చివరి వరకు కొనసాగించే అవకాశం ఉందని రాష్ట్ర సిఎం కేసీఆర్ ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చేసారు. రాజకీయంగా ఆర్ధిక పరిస్థితిపై ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఆయన ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని లాక్ డౌన్ ని కొనసాగిస్తున్నారు.

ఇది పక్కన పెడితే ఇప్పుడు మహిళల ఆర్ధిక సంవృద్ది కోసం కేసీఆర్ సర్కార్ ప్లాన్ గీస్తుంది. కరోనా కట్టడి అనేది ఇప్పట్లో అయ్యే పని కాదు. ప్రపంచ దేశాలకు ఈ సమస్య మరో రెండేళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనితో మాస్క్ ల తయారితో పాటుగా చేతి గ్లోవ్స్ ని తయారు చేయడానికి గానూ తెలంగాణాలో ఉన్న డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం.

తెలంగాణా నుంచి భారీగా మాస్క్ ల తయారితో పాటుగా శానిటైజర్ ని హోం మేడ్ ని అందించాలి అని భావిస్తున్నారు. కరోనా కట్టడి అయినా అవకపోయినా సరే ప్రత్యేక వాహనాల ద్వారా డ్వాక్రా మహిళలకు భారీగా క్లాత్ అని అందించి దాని ద్వారా మాస్క్ లను తయారు చేయించాలని వాటిని తక్కువ ధరకు అందిస్తే దేశ వ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది కాబట్టి భారీగా ఉత్పత్తి చెయ్యాలి అని చూస్తుంది సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news