కేసీఆర్ త్వ‌ర‌లోనే జైలుకు వెళ్ల‌డం ఖాయం.. బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఎప్పుడూ ఏదోఒక సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో దుమారం రేపే బండి సంజ‌య్ గ‌త కొద్దికాలంగా కొంచెం సైలెంట్ గా ఉంటున్న‌ట్టు క‌న‌ప‌డ్డాడు. అయితే అలాంటిదేమీ లేద‌ని ఆయ‌న మ‌రోసారి నిరూపించారు. ఈ సారి ఏకంగా కేసీఆర్‌పైనే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు రేపారు. ఎప్ప‌టి నుంచో బీజేపీ త‌మ వ‌ద్ద కేసీఆర్ చేసిన అవినీతి చిట్టా మొత్తం ఉంద‌ని చెబుతోంది.

ఇప్పుడు బండి సంజ‌య్ అదే విష‌యయం చెబుతూ.. త‌మ వ‌ద్ద అన్ని ఆధారాలు ఉన్నాయ‌ని, కేసీఆర్ త్వ‌ర‌లోనే జైలుకు వెళ్లడం ఖాయమని, ఆయన్ను ఎప్పుడు కటకటాల వెనక్కి పంపాలనే దానిపై తమ వ్యూహం అమ‌లు చేస్తున్నామ‌ని బండి సంజయ్ స్ప‌ష్టం చేశారు.

టీఆర్ఎస్ కీల‌క నేతల అవినీతి బాగోతాల‌కు సంబంధించి తాము పూర్తిగా ఆధారాలు సేకరించామని, 18 మంది ముఖ్య నేతలపై న్యాయపరమైన అభిప్రాయాలను తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు. కేసీఆర్‌కు సంబంధించిన సహారా, ఈఎస్ఐ కేసుల వివరాలను తాము పూర్తిగా సేక‌రిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. వారం రోజులుగా సీఎం కేసీఆర్ కేసులపైనే ఆరా తీస్తున్నామ‌ని బండి సంజ‌య్ వెల్ల‌డించారు. దీంతో ఒక్క‌సారిగా టీఆర్ ఎస్‌లో రాజ‌కీయ దుమారం చెల‌రేగిన‌ట్టు తెలుస్తోంది.