రేవంత్ రివెంజ్..కొడంగల్ ఈసారి దక్కేనా?

-

తెలంగాణలో బిఆర్ఎస్ ఇప్పటికే రెండుసార్లు గెలిచింది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బిఆర్ఎస్ భావిస్తుంటే బిఆర్ఎస్ కు చెక్ పెట్టి, ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ జెండా పాతాలని రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. బిఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతే ఈసారి కాంగ్రెస్ కి గెలుపును అందిస్తోందని రేవంత్ దీమా వ్యక్తం చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో అతి తక్కువ ఓట్లతో ఓటమి పొందారు. ఈసారి కొడంగల్ నుంచి గెలిచి తన సత్తా చాటాలని రేవంత్ పట్టుదలతో ఉన్నారు. బిఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత కూడా రేవంత్ కు లాభిస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నారు. 2018 ఎన్నికల్లో రేవంత్ ఓటమికి పట్నం నరేందర్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారని చెప్పవచ్చు. అంగ బలం అర్థబలంతో పాటు రాజకీయ బలాన్ని కూడా ఉపయోగించి రేవంత్ ను కొడంగల్ లో ఓడించారని చెప్పవచ్చు. ఆ ఎన్నికల్లో రేవంత్ ని ఓడించటానికి నరేందర్ రెడ్డి కి అన్ని రకాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం సహాయం అందించిందని చెప్పవచ్చు. కానీ ఈసారి ఎన్నికల్లో అలా లేదు బిఆర్ఎస్ కొడంగల్ ను సీరియస్ గా తీసుకునే పరిస్థితులు అయితే లేవు అని చెప్పవచ్చు. అందుకే ఈసారి కొడంగల్ లో రేవంత్ గెలుపు సునాయాసమే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ సారి రేవంత్ రెడ్డి గెలుపుకు చాలా అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అందులో మొదటిది బిఆర్ఎస్ పై ప్రజలలో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత, నిరుద్యోగ యువతకు బిఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత రేవంత్ కు లాభించే అంశాలలో ముఖ్యమైనదని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా గతంలో కొడంగల్ లో రేవంత్ ఓటమికి ఒక కారణమైన గుర్నాథ్ రెడ్డి ఈసారి రేవంత్ వైపు ఉన్నారు. అందుకే కొడంగల్ లో ఈసారి రేవంత్ కు సానుకూలత ఉందని చెబుతున్నారు. చూడాలి మరి ఈసారి కొడంగల్ లో రేవంత్ గెలుస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news