కొప్పులకు మళ్ళీ లక్ ఉందా? లక్ష్మణ్‌కు కలిసొస్తుందా?

-

రాజకీయాల్లో కష్టంతో పాటు అదృష్టం కూడా ఉంటే…ఏ నేతకైనా రాజకీయంగా సత్తా చాటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఒకోసారి ఎంత కష్టపడిన అదృష్టం లేకపోతే..గెలుపు కూడా దక్కదు. అదృష్టం ఉంటే విజయాలు కూడా అలాగే వస్తాయు. అయితే మొదట్లో రాజకీయంగా విఫలమైన తర్వాత కష్టపడుతూ..అదృష్టం కూడా కలిసి రావడంతో మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు.

తెలుగుదేశంలో రాజకీయ జీవితం మొదలుపెట్టిన ఈయన..1994లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత ఆయన నిదానంగా టి‌డి‌పికి దూరమై..2001లో కే‌సి‌ఆర్ పెట్టిన టి‌ఆర్‌ఎస్ లో జాయిన్ అయ్యారు. 2004లో మేడారం నియోజకవర్గం నుంచి గెలిచారు. మళ్ళీ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2008 ఉపఎన్నికలో పోటీ చేసి గెలిచారు. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మేడారం రద్దయ్యి..ధర్మపురి అసెంబ్లీ ఏర్పడింది. 2009లో మళ్ళీ అక్కడే విజయం సాధించారు. 2010 ఉపఎన్నికలో సత్తా చాటారు.

ఇక తెలంగాణ వచ్చాక 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. కే‌సి‌ఆర్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. అయితే 2018లో కేవలం 441 ఓట్ల తేడాతో గెలిచారు. అయితే అధికారంలో ఉంటూ కొప్పుల అధికారులని మేనేజ్ చేసి..ఈవీఏంల్లో అక్రమాలకు పాల్పడి గెలిచారని ..కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ కోర్టుకు వెళ్లారు. అది ఇప్పటికీ విచారణ సాగుతూనే ఉంది.

అయితే ఈలోపు ఎన్నికలు సమయం వచ్చేసింది. మళ్ళీ కొప్పుల, లక్ష్మణ్ పోటీ చేయడం ఖాయం. కానీ కొప్పులకు గతంలో మాదిరిగా పాజిటివ్ లేదు. ఇటు వరుసగా మూడుసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నేత లక్ష్మణ్ పై సానుభూతి ఉంది. ఒక్కసారి తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ధర్మపురిలో ఈ సారి కొప్పుల గెలుపు అంత ఈజీ కాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version