తెలంగాణలో కాంగ్రెస్‌కు షాక్.. టీఆర్‌ఎస్‌లోకి కొత్తగూడెం ఎమ్మెల్యే!

ఓవైపు ఏపీలో మరోవైపు తెలంగాణలో రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. ఏపీలో అధికార టీడీపీ పార్టీకి షాక్ ఇస్తూ టీడీపీ నేతలంతా వైసీపీలో చేరడానికి క్యూ కడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరడానికి కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించగా.. తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన లేఖలో తెలిపారు. కేసీఆర్‌పై విశ్వాసంతోనే టీఆర్‌ఎస్ నాయకత్వానికి మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా తాను సిద్ధమని వనమా వెంకటేశ్వరరావు తెలిపారు.

ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటన ఇదే…