కృష్ణా జిల్లా టోటల్ రెడ్ జోన్ గా ప్రకటించనున్నారా ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి నివాసం ఉండే తాడేపల్లి లో ఓ అపార్ట్ మెంట్ లో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి చికిత్స చేయించుకుంటూ మరణించడం జరిగింది. దీంతో జగన్ నివాసం ఉండే తాడేపల్లి కూడా రెడ్ జోన్ గా ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. అయితే తాజాగా మాత్రం ఒక్కసారిగా కృష్ణా జిల్లాలో 31 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఉన్న కొద్ది కేసుల బయట పడుతున్న తరుణంలో పైగా అధికారులు పరిపాలన చేసే వ్యవస్థ అంతా ఒకే చోట ఉన్న ప్రాంతంలో ఈ విధమైన పరిస్థితి ఉండటంతో కృష్ణా జిల్లా ప్రజలు భయంతో బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారు.కృష్ణా జిల్లాలో కరోనా అనుమానితుడు ...24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం టోటల్ కృష్ణాజిల్లా ని రెడ్ జోన్ గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో కరోనా వైరస్ వచ్చి ఐదుగురు మరణించడం జరిగింది.

 

ముఖ్యంగా విజయవాడ నగరంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో మాంసం షాపులను కూడా క్లోజ్ చేసేసారు. విజయవాడలో దాదాపు 95 శాతం ప్రాంతం రెడ్ జోన్ పరిధిలో ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో టోటల్ జిల్లాని రెడ్ జోన్ చేసే అవకాశం స్పష్టంగా ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news