ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టే ప్రయత్నాల్లో భాగంగా అధికార పార్టీ ఇప్పుడు నానా కష్టాలు పడుతుంది. టీడీపీలో అసంతృప్తి ఉన్న నేతలకు వైసీపీ గాలం వేసే ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే కొందరు నేతలు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు జగన్ కి జై కొట్టారు. ఇక ఇప్పుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా వైసీపీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు.
వైసీపీ నేతలు కొందరు ఆయనతో చర్చలు జరిపారు అనే ప్రచారం జరుగుతుంది. తాజాగా దీనిపై ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. అసలు గంటా శ్రీనివాసరావు నమ్మదగిన వ్యక్తి కాదని అన్నారు. ఆయన పార్టీలోకి వస్తే అసలు చేర్చుకునేది లేదని స్పష్టం చేసారు. ఆయనతో ఎవరూ కూడా చర్చలు జరపడం లేదన్నారు విజయసాయి రెడ్డి. ఇక రాజధాని మార్పుకి గంటా దాదాపుగా జై కొట్టారు.
అయితే అమరావతిలో రాజధాని ఉంచడానికే ఆయన మొగ్గు చూపారు. గంటా బిజెపిలో చేరె అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. బిజెపిలో మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ఆయన చేరతారని ఊహాగానాలు వచ్చాయి. ప్రజా రాజ్యం నుంచి గంటాకు చిరంజీవి కి మంచి సంబంధాలు ఉన్నాయి. దీనితో గంటా… చిరంజీవి తో కలిసి బిజెపిలో చేరే ప్రయత్నాలు చేసారు. అయినా సరే అవి ఫలించలేదు.