రేవంత్ రెడ్డి చేతికి మరో అస్త్రం అందించిన కేటీఆర్..

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. అధికార టీఆర్ఎస్‌పై తన పోరాటాన్ని ఉదృతం చేశారు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఇటీవల పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంపై రాష్ట్ర స్థాయిలో ఆందోళన చేసిన రేవంత్ రెడ్డి, తాజాగా దీనిపై చలో రాజ్ భవన్ కార్యక్రమం చేశారు. అలాగే దీని తర్వాత రాష్ట్రం లోని వివిద సమస్యల పై రేవంత్ రెడ్డి పోరాటం చేయనున్నారని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి కేటీఆర్ | Revanth Reddy KTR
రేవంత్ రెడ్డి కేటీఆర్ | Revanth Reddy KTR

ఓవైపు పార్టీని బలోపేతం చేసుకుంటూనే, మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం పై రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికి కెసిఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఒక ఆయుధం దొరికింది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అసలు తెలంగాణ ఏర్పడింది నీళ్లు నిధులు నియామకాల మీద. అంటే రాష్ట్రం వచ్చాక పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావాలి. కానీ ఆ స్థాయిలో ఉద్యోగాలు రాలేదు.

అయితే కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు లక్షా 30 వేలకు పైనే ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతున్నారు. ఇంకో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నామని చెబుతోంది. 2020 డిసెంబర్‌లో బిస్వాల్ కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదిక ప్రకారం 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు అధికారికంగా స్పష్టమైంది. అయితే ఇప్పుడు ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

కమిటీ చెప్పిన దాని ప్రకారం 1.91 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని, కానీ కెసిఆర్ ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలే ఉన్నాయని అంటుందని మండిపడుతున్నారు. మొత్తం ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి, నిరుద్యోగులని ఆదుకోవాలని అంటున్నారు. వల్ల తరుపున రేవంత్ పోరాటానికి సిద్ధమవుతున్నారు.

అయితే వాస్తవానికి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉందని మంత్రి కేటీఆర్ ఒప్పుకున్నారు. తాజాగా ఆయన మంత్రులతో సమావేశం సందర్భంలో ప్రతిపక్షాలకు మాట్లాడడానికి నిరుద్యోగ సమస్య తప్ప మరో సమస్య లేదు అని అన్నారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రం లో నిరుద్యోగ సమస్య ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే నిరుద్యోగుల తరుపున పోరాటం చేయడానికి రేవంత్ సిద్ధమవుతున్నారు. ఈ అంశం రేవంత్‌కు ఏ మేర కలిసొస్తుందో చూడాలి.