కేటీఆర్ అంటే ఎవ‌ర‌మ్మా.. ష‌ర్మిల ప్ర‌శ్న‌కు ట్రోలింగ్ ద్వార కౌంట‌ర్ వేస్తున్న నెటిజ‌న్లు!

వైఎస్ ష‌ర్మిల‌మ్మ తెలంగాణ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత అనేక ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆమె ఒక‌టి అనుకుంటే మ‌రొక‌టి జ‌ర‌గుతూ కొత్త త‌ల‌నొప్పుల‌ను తెచ్చిపెడుతున్నాయి. ష‌ర్మిల‌మ్మ ఏం చేసినా చివ‌ర‌కు ప్ర‌తిప‌క్షాల చేతిలో విమ‌ర్శ‌ల‌కు తావిచ్చే విధంగా ఆమె వ్యాఖ్య‌లు ఉంటున్నాయి. ఇక ఇప్పుడు కూడా ఆమె చేసిన వ్యాఖ్య‌లు మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో పెద్ద దుమార‌మే రేపుతున్నాయ‌ని చెప్పాలి.అనేక విష‌యాల‌పై నిన్న లోట‌స్ పాండ్ వేదిక‌గా వైఎస్ ష‌ర్మిల మీట్‌ది ప్రెస్‌లో విలేక‌ర్లతో మాట్లాడి ఎన్నో అంతులేని ప్ర‌శ్న‌ల‌కు క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు ష‌ర్మిల‌. ఇక ఇదే క్ర‌మంలో రిపోర్ట‌ర్లు అడిగిన ఓ ప్ర‌శ్న‌కు ఆమె చెప్పిన స‌మాధానం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. కేటీఆర్ చేస్తున్న విర‌మ్శ‌ల‌కు మీరు ఏం చెప్తారు అని ఒక విలేక‌రి అడిగారు.

 

ఇక దీనికి ష‌ర్మిల ఎద్దేవాగా బ‌దులు ఇచ్చార‌ని తెలుస్తోంది. ఆమె త‌న ప‌క్క‌నే కూర్చున్న ఇందిరా శోభ‌న్‌ను చూస్తూ అస‌లు కేటీఆర్ అంటే ఎవ‌ర‌మ్మా అని కావాల‌నే ఎద్దేవా చేసిన‌ట్టు, అస‌లు కేటీఆర్ త‌న దృష్టిలో లేన‌ట్టు చెప్ప‌డం ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఇక ఈ వ్యాఖ్య‌ల‌కు నెటిజ‌న్లు దిమ్మ‌తిరిగే విధంగా ట్రోలింగ్ మెద‌లు పెట్టారు. పొద్దున లేస్తే కేసీఆర్ జ‌పం చేసే ష‌ర్మిల‌కు ఆయ‌న‌ కొడుకు కేటీఆర్ అంటే ఎవ‌రో తెలియ‌దంట ఈమె ఏం రాజ‌కీయాలు చేస్తుంద‌ని అన్న‌ట్టు కామెంట్లు పెడుతున్నారు. సేమ్ టు సేమ్ కేసీఆర్ కూడా కేంద్ర‌మంత్రి అమిత్ షా అంటే ఎవ‌రో తెలియ‌ద‌న్న‌ట్టు డైలాగ్ కొడితే అది సోష‌ల్ మీడియాలో ఎంత‌గా ట్రోలింగ్ జ‌రిగిందో ఇప్ప‌డు కూడా ష‌ర్మిల‌పై అంతే ట్రోలింగ్ న‌డుస్తోంది.