కేటిఆర్ దెబ్బకు తెలంగాణా బిజెపి కాళీ అయిపోతుందా…?

-

తెలంగాణాలో బిజెపి భవిష్యత్తు గురించి మాట్లాడటం అనేది ఇప్పుడు హాస్యమే అనే అభిప్రాయం ఇటీవల సోషల్ మీడియాలో వచ్చినట్టుంది. రాజకీయంగా కెసిఆర్ ని ఎదుర్కోవడానికి బిజెపి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలిచిన బిజెపి ఆ తర్వాత బలపడటానికి విశేషంగా కృషి చేసింది. మున్సిపల్ ఎన్నికల్లు 3 మున్సిపాలిటీలు అయినా గెలవాలని చూసింది.

అంత వరకు బాగానే ఉంది గాని తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల తర్వాత పరిస్థితులు అన్నీ మారుతున్నాయి. తెరాస ఇప్పట్లో బలహీనపడే అవకాశాలు కనపడటం లేదు. రాజకీయంగా ఆ పార్టీని ఎదుర్కోవడం అనేది కష్టమే. ఎందుకంటే కెసిఆర్ స్థాయిలో ఇమేజ్ ఉన్న నాయకుడు తెలంగాణాలో మరొకరు లేరు. రేవంత్ రెడ్డికి కాస్తో కూస్తో ఉన్నా ఆయనకు సహకారం అనేది ఎక్కడా లేదు.

అది పక్కన పెడితే బిజెపిలో అసలు నాయకుడు వెళ్తే పది మంది వచ్చే పరిస్థితి లేదు. నిజామాబాద్, కరీంనగర్ లో ఆ పార్టీ ఎంపీలు మినహా ఆ పార్టీకి బలమైన నాయకులు. మిగిలిన వారు ఉన్నా గాని ప్రజాకర్షణ ఉన్న నాయకులు కాదని అంటూ ఉంటారు. సరే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులు అందరూ కూడా ఇప్పుడు తమ దారి తాము చూసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు.

తాము గెలిచిన వార్డు అభివృద్ధి చెందాలి అన్నా, వాళ్ళు ఒక రూపాయి పెట్టి అభివృద్ధి చెయ్యాలన్నా సరే నిధులు అనేది చాలా కీలకం. తెరాస లోకి వెళ్తే స్వేచ్చతో ఒక రూపాయి తెచ్చుకుని ఏదోక పని చేస్తే లాభం ఉంటుంది గాని కాషాయ జెండా పట్టుకుని తిరిగి కెసిఆర్ ని తిట్టినా కేటిఆర్ ని లాభం లేదని భావిస్తున్నారట. ఈ విషయం తెలిసిన కేటిఆర్ వాళ్ళను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. త్వరలోనే వాళ్ళు పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news