కేసీఆర్ కి కొత్త అర్ధం చెప్పిన కేటిఆర్

-

తెలంగాణలో ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్ట్ ల విషయంలో ఎక్కడా ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. తెలంగాణా రైతులకు అన్ని విధాలుగా అండగా నిలూస్తూ వానా కాలంలో సాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా తెలంగాణా సర్కార్ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ ని ప్రారంభించింది. ఈ నేపధ్యంలో తెలంగాణా సిఎం కేసీఆర్ ని పలువురు ప్రముఖులు కొనియాడుతున్నారు.

తాజాగా మంత్రి కేటిఆర్ కూడా తన తండ్రి పై ప్రసంశల వర్షం కురిపించారు. కేసీఆర్ అనే పదానికి ఆయన నిర్వచనం చెప్పారు. తన పేరును K-కాల్వలు, C-చెరువులు, R-రిజర్వాయర్లు సార్థకం చేసుకున్నారని కేటీఆర్ ట్వీట్ చేసారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజక్ట్‌లో భాగమైన కొండపోచమ్మ రిజర్వాయర్‌ పంప్‌హౌస్‌ను కేసీఆర్‌ ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ ట్వీట్ చేసారు.

ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్ధ సాధక ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని దేశంలోనే యువ రాష్ట్రమైన తెలంగాణ కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మేడిగడ్డ నుండి కొండపోచమ్మ వరకు… 82 మీటర్ల ఎత్తు నుండి 618 మీటర్ల ఎత్తు వరకు అని మంత్రి ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది ఇప్పుడు. కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ ద్వారా 2.8 లక్షల ఎకరాలకు సాగునీరు అధుతుంది అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news