కేటీఆర్‌ చెప్పారు.. పని అయిపోయింది.. ఇది కదా పని అంటే..

-

సోషల్ మీడియా లో మంత్రి కేటిఆర్ ఏ స్థాయిలో ఏ యాక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే. ట్విట్టర్ లో ఆయనకు ఎవరైనా ఏదైనా సమస్య అని చెప్తే అయన వెంటనే స్పందిస్తూ ఉంటారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఎవరైనా తమకు కష్టం ఉందని ట్విట్టర్ లో ఆయన దృష్టికి తీసుకుని రాగానే చాలా వరకు వేగంగా స్పందించి సమస్య పరిష్కారానికి అడుగులు వేస్తూ ఉంటారు.

ఇటీవల ఎర్రగడ్డలో ఒక తండ్రి తన బిడ్డకు పాలు లేవనే విషయాన్ని, కేటిఆర్ దృష్టికి స్థానిక యువకుడి సహాయంతో తీసుకుని వెళ్ళగా ఆయన వెంటనే స్పందించి రాత్రి 1 గంట సమయంలో ఆ బిడ్డకు పాలు అందించే ఏర్పాటు చేసారు. ఇక ఇప్పుడు హైదరాబాద్ లో ఉండి హాస్టల్స్ లో ఇబ్బంది పడుతున్న వాళ్లకు కూడా కేటిఆర్ అండగా నిలుస్తున్నారు. ఎవరిని కూడా హాస్టల్ యాజమాన్యాలు ఇబ్బంది పెట్టకుండా చూసే చర్యలు చేపట్టారు.

తాజాగా హైదరాబాద్ లో ఒక హాస్టల్ లో ఉంటున్న వ్యక్తులు తాము ఇబ్బంది పడుతున్నామని కేటిఆర్ దృష్టికి సమస్యను తీసుకుని వెళ్ళారు. తమకు తిండి, నీళ్ళు, కరెంట్ లేదని తమ హాస్టల్ యాజమాన్యం తమను బాగా ఇబ్బంది పెడుతుందని పేర్కొన్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కేటిఆర్ దీనిపై స్పందించారు. తన ఆఫీస్ ని పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించగా… వెంటనే స్పందించిన ఆయన ఆఫీస్… హాస్టల్ వివరాలను కనుక్కుంది. వారి అవసరాలను తీర్చినట్టు ఈ సాయంత్రం కేటిఆర్ కి రీట్వీట్ చేసింది. వారిని వేరే హాస్టల్ కి షిఫ్ట్ చేసినట్టు పేర్కొంది. దీనిపై హాస్టల్ లో ఉండే వాళ్ళు హర్షం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news