టీడీపీ కంచుకోటలో వైసీపీ పాగా వేయనుందా? వైసీపీయే గెలుస్తుందని బెట్టింగులే బెట్టింగులు..!

-

అయితే ఈసారి మాత్రం ఓటర్లు ఏపీలో మార్పు కోరుకుంటున్నారని స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న జిల్లాల్లో ఈసారి వైఎస్సార్సీపీ పాగ వేస్తుందట.

ఏపీలో తొలిదశలోనే సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి కానీ… రాజకీయ వేడి మాత్రం అస్సలు చల్లారలేదు. అస్సలంటే అస్సలు.. ఎన్నికల కంటే ఎక్కువగా ఇప్పుడు ఉంది ఏపీలో. ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు.. ఏంటి సంగతి. ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తుంది. ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థి గెలుస్తారు అనే ఉత్కంఠ మాత్రం చాలా ఉంది.

lakhs of rupees betting going on in west godavari on ysrcp

అయితే ఈసారి మాత్రం ఓటర్లు ఏపీలో మార్పు కోరుకుంటున్నారని స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న జిల్లాల్లో ఈసారి వైఎస్సార్సీపీ పాగ వేస్తుందట. పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ ఖాతాల్లో చేరిన సీట్లన్నీ ఈసారి వైసీపీ ఖాతాలోకి పోతాయట. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ పాగ వేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తుండటంతో అక్కడ బెట్టింగుల జోరు పెరిగిందట. నెల్లూరు, ప్రకాశం జిల్లాల వైపు బెట్టింగులు వేసే బెట్టింగ్ రాయుళ్లు పశ్చిమ గోదావరి వైపు కన్నేశారట. ఇక్కడ వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని తెలుసుకొని బెట్టింగులకు తెర తీశారు.



పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న మొత్తం 15 సీట్లలో వైఎస్సార్సీపీకి ఖచ్చితంగా 11 వస్తాయట. మిగిలిన నాలుగు సీట్లు మాత్రమే టీడీపీకి పోయే అవకాశాలున్నాయట. దీంతో లక్షల రూపాయలతో బెట్టింగులు కాస్తున్నారు. అలా బెట్టింగుల మీద బెట్టింగులు కాస్తూ మే 23 కోసం అంతా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news