స్వర్గీయ నందమూరి తారక రామారావు భార్య నందమూరి లక్ష్మీపార్వతి వైసీపీ పార్టీ అధికారంలోకి రావటానికి తీవ్రంగా కష్టపడింది. జగన్ పార్టీలో కీలకంగా రాణిస్తున్న లక్ష్మీపార్వతికి వైసీపీ అధికారంలోకి వచ్చాక తెలుగు అకాడమీ చైర్మన్ పదవి ఇవ్వటం జరిగింది. పదవితో పాటు క్యాబినెట్ హోదా కూడా ఇచ్చారు. నెలకు నాలుగు లక్షల వరకు జీత భత్యాలు నిర్దేశించారు. ఆ మేరకు అధికారిక ఆదేశాలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో తాజాగా ఒక వివాదం క్రియేట్ అయ్యింది. అదేమిటంటే అసలు తెలుగు అకాడమీ పదవి లేనే లేదట. అంతే కాకుండా ఇప్పటి వరకు లక్ష్మీపార్వతికి ఒక నెల జీతం కూడా అంద లేదట. విషయంలోకి వెళితే విభజన నేపథ్యంలో రాష్ట్రం రెండుగా విడిపోయినా గాని తెలుగు అకాడమీ కి సంబంధించి విభజన జరగలేదట.
దీంతో సమస్య ఏర్పడింది. ఇటువంటి తరుణంలో వైసిపి పెద్దల ముందు లక్ష్మీ పార్వతి తన సరికొత్త సంచలన నిర్ణయం పెట్టినట్లు వైసీపీ పార్టీలో టాక్. మేటర్ ఏమిటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని అది కూడా రామారావు సొంత ఊరైన నిమ్మకూరు నుండి పార్టీ తరఫున పోటీకి దింపాలని తన నిర్ణయం ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి.