కరోనా వైరస్ గురించి బాంబు పేల్చిన లండన్ యూనివర్సిటీ !!

-

ప్రపంచ దేశాలను గజగజ లాడిస్తున్న కరోనా వైరస్ రాబోయే రోజుల్లో ఉన్న కొద్దీ ప్రమాదకరంగా మారనుందని లండన్ కి చెందిన ఇంపీరియల్ యూనివర్సిటీ అంచనా వేసింది. ఈ యూనివర్సిటీ చేసిన ఒక అధ్యయనంలో బయటపడిన లెక్కలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గురించి బాంబు పేల్చినటు అయ్యింది. కఠినాతికఠిన చర్యలు తీసుకోలేకపోతే ఈ వైరస్ మహమ్మారి వల్ల అమెరికాలో దాదాపు 22 లక్షల మంది మరియు అదే విధంగా బ్రిటన్ లో 5 లక్షల మంది చనిపోయే అవకాశముందని ఆ విశ్లేషణ తెలిపింది. Image result for caroona virusఅప్పట్లో ప్రపంచాన్ని వణికించిన ఫ్లూతో పోల్చుకుంటే కరోనా వైరస్  దెబ్బ మరింతగా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండనుందని తాము ఇతర దేశాల గణాంకాలు కూడా క్రోడీకరించి ఈ వివరాలు తెలియచేస్తునట్లు చెప్పుకొచ్చారు. ఈ వైరస్ నుంచి తప్పించుకోవాలని ఎన్నో దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కఠినంగా ఉండాలని, ప్రపంచవ్యాప్తంగా క్లబ్ లు, పబ్ లు, సినిమా హాల్స్, మాల్స్ ఇలా అన్నింటిని మూసివేయాలని, ప్రజలు కూడా స్వచ్చందంగా వాటికి వెళ్లకుండా ఇంటిలో నుంచి బయటకు రాకూడదని ఇంపీరియల్ కాలేజ్ మ్యాథ్స్ ప్రొఫెసర్ నీల్ ఫెర్గూసన్ నేతృత్వంలోని ఓ టీమ్ ఈ విషయాన్ని వెల్లడించింది.

మొత్తంమీద చూసుకుంటే యూరప్ మరియు అమెరికా దేశాలలో ఈ వైరస్ ప్రభావం రాబోయే రోజుల్లో భయంకరంగా మారనుందని యూనివర్సిటీ చెప్పుకొచ్చింది. అక్కడ ఉష్ణోగ్రతలు కరోనా వైరస్ కి బాగా సహకరిస్తాయని దీంతో ఆయా దేశాలు తగు చర్యలు తీసుకోకపోతే ఈ వైరస్ నుండి బయటపడటం కష్టమని ఇంపీరియల్ యూనివర్సిటీ అంచనా వేస్తోంది. 

– రాయిటర్స్‌ సౌజన్యంతో.

Read more RELATED
Recommended to you

Latest news