కూకట్‌పల్లిపై మాధవరం పట్టు..ప్రత్యర్ధులు ఎవరు?

కూకట్‌పల్లిపై మాధవరం: కూకట్‌పల్లి..రెండు రాష్ట్రాల ప్రజలకు ఈ ప్రాంతం గురించి బాగా తెలుసు. హైదరాబాద్ లో ఉండే ఈ ప్రాంతంలో రెండు ప్రాంతాల తెలుగువారు ఉంటారు.ముఖ్యంగా ఏపీ నుంచి వచ్చిన వారే ఎక్కువ. ఇక ఈ నియోజకవర్గంలో గెలుపోటములని ఏపీ నుంచి వచ్చి స్థిరపడ్డ వారే డిసైడ్ చేస్తారని చెప్పవచ్చు. ఇక ఇలాంటి స్థానాన్ని కైవసం చేసుకోవాలని అన్నీ ప్రధాన పార్టీలు చూస్తున్నాయి. అధికార బి‌ఆర్‌ఎస్ తో పాటు, కాంగ్రెస్, బి‌జే‌పి, టి‌డి‌పి లాంటి పార్టీలు ఫోకస్ పెట్టాయి.

అయితే ఏపీ సెటిలర్లు డిసైడ్ చేస్తున్న ఈ స్థానంలో 2009 ఎన్నికల్లో లోక్‌సత్తా పార్టీ నుంచి జయప్రకాష్ నారాయణ గెలిచారు. అప్పుడు ఏపీ సెటిలర్లు జయప్రకాష్ వైపు మొగ్గు చూపారు. ఇక 2014 ఎన్నికలకు వచ్చేసరికి ప్రజల ఆలోచన మారింది. ఏపీలో టి‌డి‌పి గాలి ఉండటంతో ఇక్కడి ప్రజలు కూడా టి‌డి‌పి వైపు చూశారు. టి‌డి‌పి నుంచి పోటీ చేసి మాధవరం కృష్ణారావు..దాదాపు 43 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఇక  నిదానంగా  తెలంగాణలో టి‌డి‌పి కథ ముగుస్తూ వచ్చింది.

దీంతో మాధవరం బి‌ఆర్‌ఎస్ వైపుకు వెళ్లారు. ఇక 2018 ఎన్నికల్లో ఆసక్తి పోరు నడిచింది. కూకట్‌పల్లిలో బి‌ఆర్‌ఎస్ నుంచి మాధవరం పోటీ చేయగా, కాంగ్రెస్ పొత్తులో భాగంగా  టి‌డి‌పి నుంచి నందమూరి సుహాసిని పోటీ చేశారు. అయితే ఏపీలో టి‌డి‌పిపై వ్యతిరేకత ఉంది. ఇక కూకట్‌పల్లిలో వైసీపీ, జనసేన మద్ధతుదారులు..బి‌ఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపారు.

ఈ క్రమంలో మాధవరం మళ్ళీ విజయం సాధించారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీకి రెడీ అవుతున్నారు. ప్రస్తుతానికి అక్కడ మాధవరంకు ఆధిక్యం ఉంది. ఇక బి‌జే‌పి, కాంగ్రెస్‌ల నుంచి ఇంకా ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు. టి‌డి‌పి నుంచి సుహాసిని పోటీ చేస్తారో లేదో తెలియదు. మరి ఈ సారి కూకట్‌పల్లి ప్రజలు ఎలాంటి  తీర్పు ఇస్తారో చూడాలి.