మమత ప్రతిపక్ష సమావేశానికి టీఆర్ఎస్ డుమ్మా

రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపక్షాలతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. దేశంలో 22 మంది ప్రతిపక్ష నాయకులు ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా లేఖలు కూడా రాసింది దీదీ. ముఖ్యమంత్రులకు ఫోన్లు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా సమావేశానికి హాజరుకావాాల్సిందిగా లేఖ రాసింది. ఇప్పటికే పలు పార్టీలు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు వెల్లడించాయి. కేరళ పినరయి విజయన్ కూడా తన పార్టీ నుంచి ప్రతినిధులను పింపిస్తున్నారు.

 ఇదే విధంగా శివసేన కూడా సమావేశానికి హాజరవుతానని వెల్లడించింది. అయితే ఈ సమావేశానికి టీఆర్ఎస్ హాజరుకాబోవడం లేదని తెలుస్తోంది. దీనికి కారణం కాంగ్రెస్ ఈ సమావేశానికి హాజరు కావడమే అని తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలకు ఈ రోజు నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో  ఈ రోజు సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలిపే ప్రయత్నం చేస్తోంది. అన్ని పార్టీలు కలిసి ఎన్సీపీ అభ్యర్థి శరద్ పవార్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దింపుతారనే టాక్ ఉంది.