ఓవైపు ఎండాకాలం వేడి.. మరోవైపు రాజకీయాల వేడి ఏపీలో రగులుకుంటోంది. అధికార టీడీపీకి ఇప్పటికే చాలామంది నేతలు షాక్ ఇచ్చారు. టీడీపీలోని ముఖ్య నేతలంతా వైసీపీలో చేరారు. ఏపీ ప్రజలంతా జగన్ కు అనుకూలంగా ఉన్నారు. దీంతో టీడీపీలో ఉండి ఓడిపోయే బదులు.. టీడీపీకి రాజీనామా చేయడమే బెటర్ అని చాలామంది నేతలు భావిస్తున్నారు.
తాజాగా టీడీపీ షాక్ ఇస్తూ మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవింద రెడ్డి రాజీనామా చేశారు. చంద్రబాబు వైఖరిపై విరక్తి చెందిన గోవింద రెడ్డి టీడీపీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. అంతే కాక… మంత్రి కాల్వ శ్రీనివాస్ కు రాయదుర్గం టికెట్ ను కేటాయించడంతో అసంతృప్తి వ్యక్తం చేసి టీడీపీకి రాజీనామా చేశారు. అయితే.. గోవింద రెడ్డిని బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆయనే కాదు.. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కూడా అసంతృప్తిగానే ఉన్నాడు. చూద్దాం మరి… గోవింద రెడ్డి వైసీపీలో చేరుతారా? లేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా?