మైండ్ గేమ్: మునుగోడు బీజేపీకి కొత్త అభ్యర్ధి…?

-

మునుగోడు ఉపఎన్నికలో గెలవడానికి టీఆర్ఎస్ వేసే ఎత్తులు అన్ని ఇన్ని కాదు..ఎలాగైనా బీజేపీకి చెక్ పెట్టాలని చెప్పి…ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో కారు పార్టీ ముందుకొస్తుంది. అలాగే ప్రత్యర్ధి పార్టీల కార్యకర్తలని మైండ్ గేమ్‌తో దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మునుగోడులో టీఆర్ఎస్ పార్టీని  గెలిపించడం కోసం మంత్రి జగదీశ్ రెడ్డి కాళ్ళకు బలపం కట్టుకుని మరీ…అక్కడ ప్రచారం చేస్తున్నారు.

మరి ఈయన రాష్ట్రానికి మంత్రో..లేక మునుగోడుకు మంత్రో అర్ధం కాకుండా ఉంది. అంటే పూర్తిగా మునుగోడుకే సమయం కేటాయిస్తూ ముందుకెళుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా మునుగోడులో పర్యటిస్తూ…ప్రజలని కలుసుకుంటున్నారు. అలాగే టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి…మునుగోడులో రాజకీయం నడిపిస్తున్నారు. అయితే మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు కోసం జగదీశ్ కొత్త ఎత్తులు వేస్తున్నారు. మరి మునుగోడులో గెలవడం కష్టమని అనుకున్నారో లేక బీజేపీ బలం పెరుగుతుందని అనుకున్నారో తెలియదు గాని…ఇక్కడ ఒక మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక రావడం ఖాయం..అలాగే ఆయన బీజేపీలో చేరిపోయారు…బీజేపీ తరుపున ఆయనే బరిలో ఉంటారు. కానీ ఇక్కడ మంత్రిగారి మైండ్ గేమ్ ఎలా ఉందంటే..అసలు ఉపఎన్నిక ఇప్పటిలో వచ్చే ఛాన్స్ లేదని, ఉపఎన్నిక నిర్వహించే సత్తా బీజేపీకి లేదని చెప్పి బీజేపీ కార్యకర్తలని డైవర్ట్ చేస్తున్నారు. అలాగే బీజేపీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని తెలిసి…కోమటిరెడ్డి పోటీ నుంచి తప్పుకోవచ్చు అని మాట్లాడుతున్నారు.

ఏదో సీటు త్యాగం చేశానని చెప్పి…వేరే బీసీ నేతకు సీటు ఇవ్వొచ్చని, లేదంటే మునుగోడు బీజేపీ అభ్యర్థిగా గంగిడి మనోహర్‌రెడ్డిని కూడా ప్రకటించే అవకాశం ఉందని, కొత్త వ్యక్తికి టికెట్‌ ఇవ్వొద్దని, పాతవారికే ఇవ్వాలని బీజేపీ కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారని జగదీశ్ ఏదో బీజేపీలో ఉన్నట్లు మాట్లాడారు. అంటే ఇదంతా టోటల్ గా మైండ్ గేమ్…బీజేపీ శ్రేణులని డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ బీజేపీ శ్రేణులు అంత తేలికగా డైవర్ట్ అయ్యే ఛాన్స్ లేదు.

Read more RELATED
Recommended to you

Latest news