కొడాలి నానీని జగన్ ఎందుకు పిలిచారు…?

ఇటీవల కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్ళిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి కొడాలి నానీని టార్గెట్ చేసుకుని చేసిన పేకాట ఆరోపణలు సంచలనం అయ్యాయి. మంత్రి కొడాలి నానీ పేకాట ఆడిస్తున్నారు అని ఆయన ఆరోపించారు. మరో మంత్రి కూడా పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్నారు అని విమర్శించారు. అక్కడి నుంచి రాజకీయం వేడెక్కింది. ఆ తర్వాత మంత్రి కొడాలి నానీ స్పందించి సిఎం జగన్ పేకాట క్లబ్ లు మూసి వేసారన్నారు.

అయితే నేడు పత్రికల్లో కొన్ని వార్తలు వచ్చాయి. గుడివాడ నియోజకవర్గంలో పేకాట ఆడిస్తుండగా ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు అని… దీనితో మీడియా వర్గాల్లో ఈ వార్త హాట్ టాపిక్ కాగా జగన్ అలెర్ట్ అయినట్టు సమాచారం. తాడేపల్లి రావాలని మంత్రి నానీకి సిఎం జగన్ ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. సీఎం నివాసానికి హడావుడిగా వచ్చిన మంత్రి కొడాలి నానీ… జగన్ తో సమావేశం అయ్యారు.

గుడివాడలో ఉదయం కార్యక్రమాలు రద్దు చేసుకొని ఉన్నపళంగా తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్ళారు. గత రాత్రి గుడివాడ నియోజకవర్గంలోని తమ్మిరిస గ్రామంలో పేకాట శిబిరంపై ఎస్ఈబీ దాడులు చేసి… భారీగా వాహనాలు, నగదు సీజ్ చేసింది. అధికార పార్టీ నేతలే పేకాట క్లబ్ ను నడుపుతున్నారని ఆరోపణలు వినిపించాయి. దీనితో కొడాలి నానీ మీద జగన్ ఏమైనా చర్యలు తీసుకుంటారా అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి.