జీవితమే కాదు..పదవులు నీటి బుడగలా వంటివేనని ఆ ముగ్గురు నేతలు ఇప్పుడు సత్యాన్ని గ్రహిస్తున్నారు. ఒకప్పుడు చుట్టూ మంది మార్బలంతో నిత్యం సందడి వాతావరణంలో ఉన్న ఆ ముగ్గురు నేతల వాకిళ్లు బోసిపోతున్నాయి. కనీసం కార్యకర్తల పలకరింపులు కూడా కరువవుతున్నాయట. ఇక ప్రభుత్వ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేల నుంచి పిలుపు కూడా రావడం లేదు. దీంతో ఓ వెలుగు వెలిగిన రాజకీయ జీవితం ఇప్పుడేంటి ఇలా అయిందని మదనపడుతున్నారని సమాచారం.
ఇక అసలు విషయానికి వస్తే టీఆర్ ఎస్ మొదటి దఫా ప్రభుత్వంలో మండలిచైర్మన్‌గా స్వామిగౌడ్, భువనగిరి ఎంపీగా బూరనర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేగా శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే, మంత్రిగా పద్మారావుగౌడ్‌లు పనిచేశారు. మలిదఫా ప్రభుత్వం వచ్చే నాటికి భువనగిరి ఎంపీగా పోలీ చేసి నర్సయ్యగౌడ్ ఓడిపోయారు. స్వామిగౌడ్ మండలి చైర్మన్ పదవికాలం ముగిసిపోయింది. అయితే తర్వాత ఆయనకే ఎలాంటి పదవిని కేసీఆర్ కేటాయించలేదు. ప్రస్తుతం పూర్తిగా ఖాళీగా ఉంటున్నారు.
పద్మారావుగౌడ్ ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా పనిచేస్తున్నారు. అయితే అంతా ఆక్టివ్ పాలిటిక్స్‌లో తిరిగే అవకాశం లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నారట. మొదటి దఫా ప్రభుత్వంలో ఆయన ఎక్సైయిజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వంలో శ్రీనివాస్‌గౌడ్ మాత్రం మంత్రిగా పనిచేస్తూ కేబినేట్లో కొనసాగుతున్నారు. ఒకే సామాజిక వర్గం నుంచి ఎదిగిన నేతల్లో ఇప్పుడు శ్రీనివాస్‌గౌడ్ ఒక్కరే ఆక్టివ్‌గా ఉన్నారు. మిగతా ముగ్గరికి పదవులు దక్కకుండా శ్రీనివాస్‌గౌడ్ చేశారనే రాజకీయ ఆరోపణలు మొదలవడం గమనార్హం.
ప్రభుత్వంలో ఆయన కీలకంగా ఉండటంతో గౌడ సామాజిక వర్గం మొత్తం ఆయన చుట్టూ మూగుతోందంట. మిగతా ముగ్గురి నేతలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో తీవ్ర బాధలో ఉన్నారని సమాచారం. తెలంగాణలో సామాజికపరంగా గౌడ ఓటర్లు ఎంతో కీలకం. ఇంకా చెప్పాలంటే బలమైన రాజకీయ శక్తిగా అవకాశం ఉంది.
ఇప్పుడు శ్రీనివాస్‌గౌడ్ ఒక్కరే ఆ సామాజిక వర్గానికి ప్రతినిధిని అన్నట్లుగా వ్యవహరించడం మిగతా ముగ్గురికి నచ్చడం లేదట. అందకే కినుకు వంహించి ఆయనకు దూరంగా ఉంటున్నారట. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్‌గౌడ్ పని కల్పించుకుని మరీ వారి ఇళ్లకు చేరుకుని…అదేం లేదని అంతా కలసి పనిచేద్దామని రాజీకీయ సర్దు బాటు చేసుకుంటున్నారట. చూడాలి. మరీ మిగతా ముగ్గురు గౌడ నేతలు శ్రీనివాస్‌గౌడ్ సహకరిస్తారా..? లేదా..? అన్నది.