మండలి రద్దు తీర్మానంకు మద్దతు ప‌లికిన జ‌న‌సేన ఎమ్మెల్యే

-

శాసనమండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై విమర్శలు చేశారు. మండలిపై టీడీపీ దొంగాట ఆడుతోందన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడమే చంద్రబాబు పని అంటూ వ్యాఖ్యానించారు. పాలన వికేంధ్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనంటూ వ్యాఖ్యానించారు. అభివృద్ధి వికేంద్రీకరణ 13 జిల్లాలకు విస్తరించాలని సీఎం జగన్ తీసుకొచ్చిన ఈ బిల్లును మండలిలో అడ్డుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

అదేవిధంగా, మండలిలో ఆంగ్ల మాధ్యమం బిల్లు, ఎస్సీ,ఎస్టీ కమిషన్ల బిల్లులను అడ్డుకున్నారన్నారు. విడదీసి పాలించడమే చంద్రబాబు నైజమని విమర్శించారు. శాసనసభలో మేధావులు, రాజకీయ ఉద్దండులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులున్నారని సీఎం జగన్ చెప్పారని… ఈ సభకు పైన మరో సభ ఉండటం ఎంతమాత్రం సమంజసం కాదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news