మంత్రితో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే.. అధికార పార్టీలో ఇవ‌న్నీ కామ‌న్‌!

అదేంటో గానీ అప్పుడప్పుడు అధికార పార్టీలో నేత‌లు కూడా వాగ్వాదానికి దిగుతుంటారు. ఇక టీఆర్ ఎస్‌లో అయితే ఇలాంటి ఘ‌ట‌న‌లు అనేకం. ఒక్కోసారి ప‌బ్లిక్‌లోనే టీఆర్ ఎస్ నేత‌లు తిట్టుకున్న ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది. అయితే ఈసారి ప‌నుల విష‌యంలో మంత్రికి, ఎమ్మెల్యేకు వాగ్వాదం చోటుచేసుకుంది.

 

వ‌రంగ‌ల్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌కు, ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్‌కు తీవ్ర స్థాయిలో మాట‌ల యుద్ధ‌మే జ‌రిగింది. వ‌డ్లు కొన‌ట్లేద‌ని, సంచులు లేవంటున్నార‌ని ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్ అధికారుల‌పై మండి ప‌డ్డారు.

కొవిడ్ ఆస్ప‌త్రుల్లో పేషెంట్ల‌ను స‌రిగ్గా ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని, ఏ డాక్ట‌ర్ ఎక్క‌డ ఉంటున్నాడో తెలియ‌ట్లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే మ‌ధ్య‌లో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు క‌ల్పించుకుని ఎమ్మెల్యేకు స‌ర్ధి చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఇలాంటివి ఏమైనా ఉంటే త‌న దృష్టికి తీసుకురావాల‌ని, ఇలా ప‌బ్లిక్‌లో పార్టీకి ఇబ్బంది క‌లిగించేలా చేయొద్దంటూ సూచించారు. కానీ ఎమ్మెల్యే మాత్రం త‌గ్గ‌కుండా మంత్రితో కాసేపు వాగ్వాదానికి దిగారు. అనంత‌రం అక్క‌డి నుంచి వెల్లిపోయారు.