ఎంత శత్రువులయినప్పటికీ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలనుకున్నారో ఏమో… జగన్, మోదీ ఇద్దరు చంద్రబాబుకు తమ ట్విట్టర్ లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎంతమంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపినా పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ… ఆయన బద్ధశత్రువులు ఇద్దరు మాత్రం ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. అదే ఇప్పుడు చెప్పుకోవాల్సిన అంశం. చాలా ఏళ్ల నుంచి జగన్, చంద్రబాబు మధ్య వైరం ఉంది. వాళ్లిద్దరి మధ్యా పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. ఇక పోతే … చంద్రబాబు, నరేంద్ర మోదీ మధ్య కూడా ఈమధ్య వైరం స్టార్ట్ అయింది.
అయితే.. ఎంత శత్రువులయినప్పటికీ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలనుకున్నారో ఏమో… జగన్, మోదీ ఇద్దరు చంద్రబాబుకు తమ ట్విట్టర్ లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వీళ్లతో పాటు చంద్రబాబు ముద్దుల తనయుడు నారా లోకేశ్ కూడా చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
Greetings to Andhra Pradesh CM, @ncbn Garu on his birthday. Praying for his long and healthy life.
— Chowkidar Narendra Modi (@narendramodi) April 20, 2019
Warm birthday greetings to @ncbn garu
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2019
I’m the most fortunate to have watched you being the visionary & doer that the world knows while being a doting husband, father & grandpa who continues to hop & run with Devaansh like a 4-yr-old. Here’s to a more energetic & enthusiastic you in the coming years, #HappyBirthdayCBN
— Lokesh Nara (@naralokesh) April 20, 2019