టీడీపీకి కొడాలి నానీ షాక్…? ఇద్దరు యువనేతలు వైసీపీలోకి…?

Join Our Community
follow manalokam on social media

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ విషయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసే తప్పులు పార్టీ పునాదుల మీదనే ప్రభావం చూపిస్తున్నాయి అనే భావన గత కొన్ని రోజులుగా ఉంది. చంద్రబాబు నాయుడు సమర్ధ నాయకత్వాన్ని కార్యకర్తలకు అందించే విషయంలో చాలా దారుణంగా తప్పులు చేస్తున్నారనే విషయం అర్ధమవుతుంది. అగ్ర నేతలు చాలా మంది ఇప్పుడు పార్టీలో పెత్తనం చేలాయిస్తున్నారు.

tdp

కాని రాయలసీమ జిల్లాలకు చెందిన యువ నేతలు చాలా వరకు పార్టీ కోసం పని చేయడానికి ఆసక్తి చూపించడం లేదనే విషయం అర్ధమవుతుంది. అగ్ర నేతల కుమారులే గాని యువ నేతలు ఎవరూ ముందుకు రావడం లేదు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఇదే పరిస్థితి ఉంది. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో కూడా యువ నేతలకు ప్రాధాన్యత లేదు.

అందుకే ఇప్పుడు కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు యువనేతలు వెళ్ళిపోతున్నారు. పార్టీ కోసం పదేళ్ళ నుంచి ఆస్తులు కూడా అమ్ముకున్న ఆ ఇద్దరు యువ నేతలు త్వరలో వైసీపీలో చేరుతున్నారు. మంత్రి కొడాలి నానీతో ఇప్పటికే చర్చలు జరిపారని సమాచారం. బందరు పార్లమెంట్ కి చెందిన ఇద్దరు యువనేతలు వైసీపీ కార్యకర్తలతో కూడా మాట్లాడుతున్నారు. అన్ని పార్టీలతో వాళ్లకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే వాళ్ళు ఇప్పుడు పార్టీ మారిపోయే ఆలోచనలో ఉన్నారు. రాష్ట్ర కమిటీలో కూడా వారికి ప్రాధాన్యత లేదు. అందుకే ఇప్పుడు పార్టీ మారిపోతారని చంద్రబాబుకి కూడా సమాచారం ఇచ్చారని సమాచారం.

TOP STORIES

భక్తి: మాఘ పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి..?

మాఘ పౌర్ణమి చాల ప్రత్యేకమైన రోజు. ఆరోజు హిందువులు ప్రత్యేక పూజలు చేయడం, నదీ స్నానాలని చేయడం చేస్తారు. అలానే ధానం చేయడం మొదలైన వాటిని...