పశ్చిమ బెంగాల్‌లో తెర పైకి కొత్త పొత్తులు

-

రాజకీయాలు మారుతున్నాయ్‌. కొత్త పొత్తులు తెరమీదికి వస్తున్నాయ్‌. బీహార్‌లో కాంగ్రెస్‌తో జత కట్టిన ఆర్జేడీ.. బెంగాల్‌లో మమతకు జై కొడుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తున్నట్లు తేజస్వి యాదవ్‌ ప్రకటించారు. అటు కాంగ్రెస్‌ మాత్రం లెఫ్ట్‌ పక్షాలతో కలిసి నడుస్తోంది..

రాజకీయాలంటే విచిత్రంగా ఉంటాయ్‌.. ఓ చోట మిత్రులు..మరో చోట ప్రత్యర్థులుగా మారుతారు..పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి పొత్తులే హాట్‌ టాపిక్‌గా మారాయి. బీహార్‌లో వామపక్షాలు, కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన ఆర్జేడీ.. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం మమతకు జై కొట్టింది. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీని కలిసిన తేజస్వి యాదవ్‌..బెంగాల్‌లోని కొన్ని చోట్ల తృణమూల్‌తో కలిసి పోటీ చేయనున్నట్లు చెప్పారు.

పశ్చిమ బెంగాల్‌లో అనేక మంది బీహారీలు ఉన్నారని.. వాళ్లంతా.. తృణమూల్‌ కాంగ్రెస్‌కే ఓటేయాలని తేజస్వి యాదవ్‌ పిలుపునిచ్చారు. దీదీకి మద్దతు ఇవ్వాలని చెప్పారు. బెంగాల్‌ను.. బెంగాల్‌ సంస్కృతిని కాపాడుకోవాలన్నా.. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలవాలని చెబుతున్నారు. అంతేకాదు.. రాజకీయ పరిస్థితులను బట్టి పొత్తులు ఉంటాయని చెబుతున్నారు తేజస్వి యాదవ్‌.

అటు మమత కూడా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. బీహారీల ఓట్ల కోసం తేజస్విని తెరపైకి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. త్వరలో తేజస్వి యాదవే.. బీహార్‌ పగ్గాలను అందుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా పశ్చిమ బెంగాల్‌ పాలిటిక్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. మరోవైపు కాంగ్రెస్‌ మాత్రం తృణమూల్‌తో కాకుండా లెఫ్ట్‌ పార్టీలతో కలిసి వెళ్తోంది. దీంతో బెంగాల్‌ దంగల్‌ ఆసక్తికరంగా మారింది.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, పశ్చిమ బెంగాల్‌ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎలాగైన బెంగాల్‌ను దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది బీజేపీ. ఈ సమయంలో మోదీకి వ్యతిరేక పక్షాలన్నీ ఒక్కటవ్వాల్సి ఉన్నా.. అటు తృణమూల్‌, ఆర్జేడీ ఇటు కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పక్షాలు చెరో దారి ఎంచుకున్నాయి. అందుకే దీదీ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు..

Read more RELATED
Recommended to you

Latest news