గతకొన్ని రోజులుగా వైకాపాలో అల్లకల్లోలం సృష్టిస్తోన్న నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని పార్టీ చూస్తుందా అంటే… అవుననే సంకేతాలు వస్తున్నాయి!! పార్టీలోనే ఉంటా.. జగన్ తన దైవం.. అని నోటితో చెబుతూ, నొసటితో వెక్కిరిస్తోన్న ఆర్.ఆర్.ఆర్. విషయంలో జగన్ కూడా అదేస్థాయిలో రియాక్ట్ అవుతున్న దశలో… వ్యవహరం హస్తినకు చేరింది! ఈ క్రమంలో ఉప ఎన్నికలు వస్తే… అన్నది పెద్ద ప్రశ్న!
నరసపురం పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు వచ్చినా, రాకున్నా.. నెక్స్ట్ ఎన్నికల్లో ఆర్.ఆర్.ఆర్. కైతే వైకాపా టిక్కెట్ ఇవ్వదు. ఆటలు సాగడం లేదు కాబట్టి.. ఆయన కూడా ఆశించడం లేదనుకోండి… అది వేరే విషయం! ఒకవేల ఉప ఎన్నికలు జరిగినా.. సబ్బం హరి లాంటి “విశాఖ ప్రవక్త”ల మాట ప్రకారం జమిలీ ఎన్నికలు వచ్చినా రాకున్నా… వైకాపా తరుపున నరసాపురం పార్లమెంటు స్థానానికి ఒక ఇన్ ఛార్జ్ కావాలి కాబట్టి… వైకాపా కొత్త ఎత్తు వేస్తుందని అంటున్నారు!
గతకొన్ని రోజులుగా రాష్ట్రంలో సంచనలం సృష్టిస్తోన్న ఈఎసై స్కాం వ్యవహారంలో అచ్చెన్నాయుడి అనంతరం వినిపిస్తోన్న పేరు పితాని సత్యనారాయణ! స్కాంలో ఆయనకు ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా… అయన సుపుత్రుడు వెంకట్ ప్రమేయం ఉండొచ్చని ఇప్పటికే దాదాపు సంకేతాలు వస్తోన్నాయి! ఈ సమయంలో ఈ స్కాంలో పితాని పాత్రకాని, ఆయన సుపుత్రుడు వెంకట్ పాత్ర కానీ లేదని, మొత్తం అచ్చ్చెన్నే చేశారని కానీ నిరూపణ అయినపక్షంలో… ఆచంట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన పితాని సత్యనారయణను నరాసపురం పార్లమెంట్ స్థానానికి ఇన్ ఛార్జ్ గా నిలబెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు!! దీంతో పితాని జీవితంలో ఈ ఈఎస్ఐ స్కాం కీలకం కాబోతుంది. తప్పు చేసి ఉంటే కటకటాలు.. అలా కాని పక్షంలో కీలక మలుపు!!