తెలంగాణలో న్యూ సర్వే..సీఎం అభ్యర్ధిలో ట్విస్ట్..లీడ్ ఆ పార్టీదే..

-

తెలంగాణలో ఎన్నికలకు ఇంకా రెండు ఏళ్ల సమయం ఉంది….కానీ ఈలోపే తెలంగాణలో పార్టీల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటినుంచే ఎన్నికల వాతావరణం మొదలైపోయింది. హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం తర్వాత ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ఏ సమయంలో ఎలా రాజకీయం మారుతుందో అర్ధం కాకుండా ఉంది.

అయితే తాజాగా తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్తితులకు తగ్గట్టుగా ఓ సర్వే బయటకొచ్చింది. గ్రౌండ్ రిపోర్ట్ అనే సంస్థ…తాజాగా తెలంగాణకు సంబంధించిన ఒపీనియన్ పోల్‌ని బయటపెట్టింది. 119 నియోజకవర్గాల్లో దాదాపు వెయ్యి మంది నుంచి నాలుగు వేల మంది ఓటర్ల అభిప్రాయం తెలుసుకున్నట్లు ఆ సంస్థ చెబుతుంది. ఇక ఈ పోల్ ప్రకారం…మళ్ళీ టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పింది.

కానీ టీఆర్ఎస్ మెజారిటీ పూర్తిగా తగ్గుతుందని తేలింది. టీఆర్ఎస్‌కు 65-70 సీట్లు వస్తాయని చెప్పింది. ఇక ఇందులోనే ఎం‌ఐ‌ఎంకు 6 సీట్లని కలిపి ఇచ్చేసింది. అంటే టీఆర్ఎస్-ఎం‌ఐ‌ఎం కలిస్తేనే కాస్త లీడ్ వస్తుందని అర్ధమవుతుంది. ఎందుకంటే 60 స్థానాలు మ్యాజిక్ ఫిగర్…అది దాటిన వారిదే అధికారం. అయితే టీఆర్ఎస్-ఎం‌ఐ‌ఎంలు కలిసి మ్యాజిక్ ఫిగర్ దాటతాయని తేలింది. ఇక సెకండ్ ప్లేస్‌లో కాంగ్రెస్ ఉంటుందని సర్వేలో తేలింది. ఆ పార్టీకి 35-40 సీట్లు వస్తాయని, అలాగే బీజేపీకి 12-14 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పింది. ఇక ఇతరులకు 0-1 సీట్లు రావొచ్చని చెప్పింది.

అయితే సీఎం అభ్యర్ధి విషయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది…రేవంత్ రెడ్డిని సీఎంగా చూడాలని 44 శాతం మంది కోరుకుంటున్నట్లు తేలింది. ఆ తర్వాత కేసీఆర్‌ని 42 శాతం, బండి సంజయ్‌ని 6-7 శాతం మంది సీఎంగా చూడాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ఇక ఇతరులకు 5-6 శాతం వచ్చింది. అంటే పార్టీల్లో టీఆర్ఎస్‌కు లీడ్ ఉండగా, సీఎం అభ్యర్ధుల్లో రేవంత్ రెడ్డి ముందు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news