రూ.50 వేల కోట్లతో మోదీ కొత్త స్కీమ్..!

-

కరోనా వైరస్ కారణంగా.. పట్టణాల నుంచి స్వస్థలాలకు చేరి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వలస కూలీలే లక్ష్యంగా కేంద్రం నూతన పథకాన్ని ప్రారంభించనుంది. గ్రామీణ భారతంలో జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచే ఉద్దేశంతో రూపొందించిన గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ కార్యక్రమాన్ని జూన్ 20 వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ఈ స్కీమ్‌ను లాంచ్ చేస్తారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మీడియా తో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకువస్తున్నామని ఆమె తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో నివసించే వారు, వెనుకకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు ఉపాధి కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. తొలుత బిహార్, ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లోని.. 116 జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ 116 జిల్లాలలో 125 రోజుల పాటు పని కల్పించనున్నారు.

గరీబ్ కల్యాణ్ రోజ్‌గర్ అభియాన్ కింద దాదాపు 25 పథకాల సేవలను ఒకేచోటు అందిస్తామని వివరించారు. ని కోసం రూ.50 వేల కోట్లు వెచ్చిస్తామని ఆమె తెలిపారు. గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్’ పథకాన్ని 2020 జూన్ 20 న ఉదయం 11 గంటలకు బిహార్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అభియాన్‌ను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news