తక్కువ సమయం లో ఎక్కువ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఓర్వ లేక నే కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని నూతనం గా ఎన్నిక అయిన ఎమ్మెల్సీ కడియం శ్రీ హరి అన్నారు. కాగ తెలంగాణ లో ఆరు ఎమ్మెల్సీలూ ఏకగ్రీవమయ్యాయి. అందులో కడియం శ్రీ హరి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మీడియా తో మాట్లాడారు. అలాగే బీజేపీ నిప్పులు చేరిగారు.
ఎదుగుతున్న తెలంగాణ ను చూసి ఓర్వలేక నే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ తెలంగాణ ను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడెళ్లు అవుతుందని అన్నారు. ఈ కాలం లో దేశ జీడీపీ భారీ గా తగ్గిందని అన్నారు. దీనికి కారణం ఎవరు అని ప్రశ్నించాడు. అలాగే కరోన సమయంలో జీడీపీ మైనస్ లోకి వెళ్ళిందని అన్నారు. నరేంద్ర మోడీ గొప్ప పరిపాలన దక్షుడు అయితే దేశ జీడీపీ ఎలా తగ్గిందో రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పాలని సవాల్ విసిరాడు. అలాగే ధాన్యం సేకరణ అనేది కేంద్రం పరిధి అని తెలిపారు. కానీ కేంద్ర మే కొనటం లేదని తెలిపారు.